B'luru Google employee tests covid positive బెంగళూరు గూగుల్ ఉద్యోగికి కరోనా పాటిజివ్

Hospital staff who treated india s first coronavirus fatality suffering from same symptoms

Coronavirus, covid-19, mohammad Hussain, Jubiliee hills corporate hospital, Fever, Gulburga hospital staff, corporate hospital, Telangana, Gulburga, karnataka, politics

A 76-year-old man from Kalaburagi in north Karnataka, who died on March 10, is the country’s first Covid-19 fatality, the state health officials rushed to the hospital and confirmed the staff are suffering from covid-19 symptoms, Their blood test are sent and results awaited.

సిద్దిఖీకి వైద్యం చేసిన సిబ్బందిలో కరోనా లక్షణాలు..

Posted: 03/13/2020 11:39 AM IST
Hospital staff who treated india s first coronavirus fatality suffering from same symptoms

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లో మొత్తం 75 మందికి సోకిందని భారత అరోగ్యశాఖ వెల్లడించింది. కాగా తాజాగా బెంగుళూరులోని గూగుల్ ఉద్యోగికి కూడా కరోనా వ్యాధి సోకింది. విదేశాల నుంచి వచ్చిన సదరు ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. సదరు ఉద్యోగిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీంతో సదరు కార్యాలయంలోని ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించారు. అందరినీ గృహనిర్భంధంలోనే వుండి పనులు చేయాలని సంస్థ అదేశించినట్లు సమాచారం.

భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైన నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటక వాసి హైదరాబాద్ లో చికి్త్స తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీ మరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన చికిత్స కోసం వెళ్లిన కార్పోరేట్ అసుపత్రులతో పాటు.. ఆయనకు చికిత్సను అందించిన ఆసుపత్రులోని వైద్యసిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

కాగా  మహ్మద్ హుసేన్ సిద్ధిఖీకి వైద్యం అందించిన 10 మంది డాక్టర్లు, నర్సుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించామని కర్ణాటక అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి గుల్ బర్గాకు వచ్చిన సిద్ధిఖీ, దగ్గు, జలుబుతో బాధపడుతూ, ఈ నెల 6న ఆసుపత్రిలో చేరారు. రక్త నమూనాల రిపోర్ట్ వచ్చేలోగా, 10న మరణించారు. ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తరువాత కలిసిన దాదాపు 50 మందిని గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

వీరికి రక్త పరీక్షలు నిర్వహించి పంపామని.. ప్రస్తుతం రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. రిపోర్టుల్లో నెగటివ్ గా వస్తే, వెంటనే పంపిస్తామని, ఆపై వీరందరూ కనీసం 2 వారాల పాటు ఎవరినీ కలువకుండా ఉండాలని సూచించామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలోని ఓ ప్రైవేటు అసుపత్రిలోనూ మృతుడు చికిత్స తీసుకున్న నేపథ్యంలో సదరు ఆసుపత్రి సిబందికి కూడా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఇక ఆయన నగరంలోని బంధువలు ఇళ్లలో కూడా బసచేసినట్లు సమాచారంతో వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles