India reports first Coronavirus death in Karnataka దేశంలో తొలి కరోనా మరణం.. హైదరాబాదులో కలకలం..

India reports first coronavirus death in karnataka create ripples

Coronavirus, covid-19, mohammad Hussain, Jubiliee hills corporate hospital, Fever, Telangana, Gulburga, karnataka, politics

Tension triggered across the nation after the first Coronavirus death case recorded in Karnataka and the total number of cases raised to 70. According to the sources, A 76-year-old man who died recently has been confirmed with deadly Coronavirus case and it took place in Kalburigi, Karnataka.

దేశంలో తొలి కరోనా మరణం.. హైదరాబాదులో కలకలం..

Posted: 03/13/2020 11:10 AM IST
India reports first coronavirus death in karnataka create ripples

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను వణికిస్తున్న క్రమంలో తెలంగాణలో తొలి కరోనా మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఈ మరణమే దేశంలోనూ తొలి కరోనా మరణంగా నమోదు కావడంతో జాతీయ అరోగ్యశాఖ కూడా అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్ లో 70 ఏళ్ల మహ్మద్ హుస్సెన్ కర్ణాటక వ్యక్తి మరణానికి కరోనానే కారణమని తేలింది. కర్ణాటకలోని కాలాబురాగీ ప్రాంతానికి చెందిన మహ్మద్ సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి తన స్వగ్రామైన కాలాబురాగీకి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన దగ్గు, జలుబు. శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతూ.. జ్వరం బారిన పడ్డారు. దీంతో గుల్బర్గ లోని ఓ ప్రైవేటు అసుపత్రిలో ఆయనకు చికిత్సను అందించారు.

అయినా జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మహమ్మద్ హుస్సేస్ సిద్దిఖీని హదారాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అక్కడి నంచి నగరంలోని మరో అసుపత్రికి తరలించారు. అయితే వ్యాధి తగ్గకపోవడంతో.. కార్పోరేట్ ఆసుపత్రులు కేసు టేకఫ్ చేయకపోవడంతో ఆయనను మరో అసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందిన ఆయన వ్యాధి తగ్గకపోవడంతో ఈ నెల 9న తిరిగి తన స్వగ్రామామైన కాలాబుర్గికి అంబులెన్సఉలో వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు. అతడి మరణానికి కరోనానే కారణమని నిర్ధారణ అయినట్టు చెప్పారు. కరోనా వ్యాధికి పారాసెటమాల్ మాత్రచాలునని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఈ తరుణంలో పలు విమర్శలు వస్తున్నాయి.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో కరోనా మరణం సంభవించడం నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్కడి నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కు వచ్చిన సాప్ట్ వేర్ ఇంజనీర్ కు వ్యాధి నయం అయ్యిందని, త్వరలోనే అతడ్ని అస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపిన 24 గంటల వ్యవధిలోనే తెలంగాణలో మరో కరోనా మరణం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర హైకోర్టు అదేశాలను కూడా తోసిరాజుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధిపై పలు వ్యాఖ్యలు చేసింది.

కరోనా వ్యాధికి ఎలా సోకుతుందోనన్న వివరాలను చెప్పిన ప్రభుత్వం.. ఈ వ్యాధికి మాస్కులు, ఖరీదైన వైద్యం కూడా అవసరం లేదని.. మాస్కులను ఉచితంగా పంచాలని రాష్ట్ర హైకోర్టు చేసిన అదేశాలను కూడా తోసిరాజింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మరణంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వ్యాధి మరింత మందికి సోకకుండా తక్షణ చర్యలు తీసుకుంటోంది. వ్యాధి వుందన్న అనుమానాలు వున్న వ్యక్తలను గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సను అందించాలని, ఇక బస్టాండ్లు, రైల్వేస్టుషన్లతో పాటు కరోనాపై అటు గ్రామాల్లోనూ ప్రచారం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles