JDU leader's daughter declares herself CM candidature ‘‘సీఎం అభ్యర్థిని నేనే’’ భారీ ప్రకటనలిచ్చిన యువతి

Uk based woman to contest bihar elections as chief ministerial candidate

Pushpam Priya Choudhary, Bihar elections 2020, Chief ministerial candidate, Plurals, BIhar, JDU party, Vinod choudary, RJD, Lalu prasad Yadav, Nitish kumar, susheel Modi, Politics

Pushpam Priya Choudhary, the daughter of former Janata Dal United MLC Vinod Chaudhary, has declared herself as the "Chief Ministerial candidate" for the upcoming Assembly elections in Bihar.

‘‘సీఎం అభ్యర్థిని నేనే’’ భారీ ప్రకటనలిచ్చిన యువతి

Posted: 03/09/2020 01:04 PM IST
Uk based woman to contest bihar elections as chief ministerial candidate

బీహార్ ఎన్నికల నేపథ్యంలో సరిగ్గా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఎన్ఆర్ఐ సొంత పార్టీని స్థాపిస్తూ ప్రకటనలు జారీ చేయడం రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి కారణమయ్యింది. బీహార్ ను ప్రేమిద్దాం.. రాజకీయాలను ద్వేషిద్దాం అంటూ సరికొత్త నినాదంతో ముందుకెళ్తున్న ఈ నాయకురాలు.. తన పార్టీ తరపున అమె ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా పేర్కొనడం గమనార్హం. జేడీయూ నేత బినోద్ చౌదరి కూతురు లండన్ లో స్థిరపడిన పుష్పమ్ ప్రియాచౌదరి ఇంతటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు అమె హిందీ, ఇంగ్లీషు దినపత్రికల్లో పెద్ద ఎత్తున్న ప్రచార ప్రకటనలు ఇవ్వడంతో రాష్ట్రంలో కొత్త పార్టీ అవిర్భావించిందని విషయం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తన పార్టీలో ఒక్కరు.. నియంత తరహా పాలన వుండదని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ రాష్ట్రాన్ని పాలించుకునే అవకాశం వుండేలా.. అంతటి జనరంజకంగా పాలన సాగుతుందని, అమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా పోస్టు చేశారు. బీహార్ దిశానిర్ధేశం కావాలని, వాటివైపు శరవేగంగా పయనించేందుకు రెక్కలు కూడా తొగడాలని, ఇది మార్పుతోనే సాధ్యమని, ఆప్పుడే అభవృద్ది సాధ్యమవుతుందని, బీహార్ కు ఉత్తమోత్తమం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రియా చౌదరి పేర్కోంది.

రాజకీయాలపై విరక్తి వచ్చేస్తోందని.. అందుకనే తమ పార్టీ రాష్ట్రాన్ని ప్రేమించమని, రాజకీయాలను ద్వేషింద్దామన్న నినాదంతో ముందుకెళ్తోందని అమె ప్రకటనలో పేర్కోన్నారు. తమ పూరల్స్ పార్టీతో కొత్తపుంతలు తొక్కడం ఖాయమని ఇక తన పార్టీలో చేరేందుకు సిద్దాంతాలు నచ్చిన వారు రావచ్చని కూడా అమె బాహాటంగా పిలుపునిచ్చారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌‌లో చదువుకున్న తాను రాష్ట్రంలో సమగ్రమార్పుకు పలు విషయాలను రాష్ట్ర ప్రజలతో త్వరలో పంచుకుంటానని చెప్పారు.  రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తారో ఎవరికీ తెలియదంటూ ఆమె పేర్కొంది. ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కొన్ని రోజుల నుంచి వరుస ట్వీట్లు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles