Maruthi Rao postmortem preliminary report మారుతిరావు శరీరంపై గాయలు చూడని వైద్యులు..

Amrutha seeks police custody to get last glimpse of her father maruthi rao

Amrutha, Amruthavarshini, Pranay, honour killing prime accused, Maruti Rao, Shravan, girija, Miryalaguda, nalgonda, crime, Telangana crime

Amruthavarshini sought police help to get the last glimpse of his father Maruthi Rao who committed suicide at Arya Vysya Bhavan in Hyderabad. However, Amrutha's mother Girija and her uncle Sravan objected her to visit their residence.

బ్రెయిన్ డెడ్, గుండెపోటుతో మారుతిరావు మరణం.. అంత్యక్రియలు పూర్తి..

Posted: 03/09/2020 12:15 PM IST
Amrutha seeks police custody to get last glimpse of her father maruthi rao

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కేసులో వైద్యులు నిర్వహించిన మృతదేహానికి పోస్టుమార్టం నివేదిక ఇవాల పోలీసులకు అందింది. కాగా, మారుతిరావు బ్రెయిన్ డెడ్, కార్టియాక్ అరెస్టు కారణంగా మరణించాడని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నట్లు వైద్యులు, తమ ప్రాథమిక నివేదికలో పేర్కోన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆయనది పూర్తిగా ఆత్మహత్యేనని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు తమ నివేదికలో పేర్కోన్నట్లు తెలుస్తోంది. విషం తీసుకోవడం వల్లే ఆయన బ్రెయిన్ డెడ్, గుండెపోటు కారణంగా మరణించారని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొందని సమాచారం. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

కాగా తన వల్లే తన తండ్రి మారుతిరావు చనిపోయాడంటే తాను అంగీకరించేది లేదని ఆయన కుమార్తె అమృత స్పష్టం చేసింది. తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహరాల్లో ఏర్పడిన వివాదాలపై అందరికీ తెలిసిందేనని, వాటివల్లే ఆయన ఈ విపరీత చర్యకు పాల్పడివుండవచ్చునని అమె అన్నారు. అయితే అల్లుడిని చంపానన్న పశ్చాతాపం కూడా వెంటాడి ఉండవచ్చునని అన్నారు. తన భర్త హత్య చేయించినప్పుడే తనకు ఆయనపై వున్న ప్రేమ తొలగిపోయిందని.. అయితే తన తండ్రిని చివరిసారిగా చూడాలని వుందని మాత్రం అమె చెప్పింది.

కాగా, తన తండ్రి కడసారి చూపుకు, అంతిమ సంస్కారాలకు తాను హాజరైయ్యేందుకు తన తల్లి గిరిజ, తన బాబాయ్ శ్రావణ్ లు అంగీకరించలేదని అమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను అమృత బాబయ్ తోసిపుచ్చారు. మారుతిరావు అంత్యక్రియలకు రావొద్దని అమృతకు తాము చెప్పిలేదని ఆయన అన్నారు. ఇంతటి విషాదసమయంలోనూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు, మిర్యాలగూడలోని మారుతీరావు ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. కాగా, అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles