TTD to get thermal guns for screening devotees ‘‘ఆ భక్తులు తిరుమలకు రావొద్దు’’: టీటీడీ ఆంక్షలు

Devotees asked to avoid visiting tirumala temple if suffering from covid symptoms

Tirumala tirupati Devasthanam, TTD, Devotees, Epidermic, Coronavirus, covid-19, cold, dry cough, dharma darshan, darshan within no time, Additional Executive Officer of TTD, AV Dharma Reddy, Andhra Pradesh

In the wake of coronavirus, Tirumala Tirupati Devasthanam (TTD) trust has appealed to devotees visiting the Venkateswara Temple in Tirumala to take precautions to avoid the spread of COVID-19 in the temple town.

‘‘ఆ భక్తులు తిరుమలకు రావొద్దు’’: టీటీడీ ఆంక్షలు

Posted: 03/09/2020 01:57 PM IST
Devotees asked to avoid visiting tirumala temple if suffering from covid symptoms

ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా.. చివరికు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంబంధించిన ఏ సమస్య తలెత్తినా.. ముందుగా గుర్తుకువచ్చేది భగవంతుడే. కొందరు ‘‘ఆయ్యా ఈ కష్టాలను గట్టెకిస్తే నీ కొండకు వస్తా’’మని అనుకుంటారు.. ఇంకోందరు.. ‘‘నీ కొండకు వస్తున్నాం.. ఇక ఈ సమస్యను పరిష్కార బాధ్యత నీదే’’అంటూ అంతా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిపై వేస్తుంటారు. భక్తుల ఆపద మొక్కులను తీర్చేవాడు కాబట్టే ఆయనకు ఆపద మొక్కుల వాడా అని కూడా భక్తులు పిలుస్తుంటారు. అయితే ఇలాంటి భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఆంక్షలు విధించింది.

ప్రపంచ వ్యాప్తంగా జడలు విప్పుతూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి వారు దర్శనానికి వస్తే భక్తుల రద్దీ కారణంగా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్‌)కు తరలించాలని నిర్ణయించింది. అలాగే, భక్తులు శానిటైజర్లు, మాస్కులతో రావాలని సూచించింది.

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందున్న వారుని స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్న బోర్డు.. దేశీయ భక్తులపై మాత్రం ఎలాంటి పరీక్షలు చేయడం లేదని.. అందుకనే ఈ వ్యాధి లక్షణాలు వున్న భక్తులు తమంతట తాము తిరుమలకు రాకూడదని ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలని కోరింది. అంటువ్యాధి కావడంతో మిగతా స్వామివారి భక్తులకు ఈ వ్యాధి సోకే ముప్పు వున్నందున.. ఈ లక్షణాలు వున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles