Fadnavis to face trial in poll affidavit case మాజీ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Devendra fadnavis to face trial in poll affidavit case

Devendra Fadnavis, 2014 Maharashtra elections, Maharashtra news, Devendra Fadnavis criminal cases, BJP leader Devendra Fadnavis, Supreme Court top news, Supreme Court

The Supreme Court has dismissed a review petition filed by former Maharashtra Chief Minister Devendra Fadnavis against its October 1, 2019, judgement, in a case regarding not disclosing all criminal cases in election affidavit in 2014.

మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. క్రిమినల్ ప్రోసీడింగ్స్ కు అదేశం..

Posted: 03/03/2020 08:00 PM IST
Devendra fadnavis to face trial in poll affidavit case

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2014 ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన కేసులో ఆయన విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలంటూ ఇదివరకు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఫడ్నవీస్‌ వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయన షాక్ తగిలింది. 2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న రెండు కేసుల వివరాలను పొందుపర్చలేదని ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.

అంతేకాదు దేవేంద్ర ఫడ్నవీస్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగ్ పూర్ ‌కు చెందిన న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కోన్నారు. అయితే, దేవేంద్రపై కేసు నమోదు చేసేందుకు నాగ్ పూర్‌‌ కోర్టు నిరాకరించగా.. బాంబే హైకోర్టు దాన్ని సమర్థించింది. ఏకంగా రెండు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తరువాత కూడా వెనక్కు తగ్గని న్యాయవాది ఏకంగా ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. దీంతో, వాదనలు విన్న సుప్రీం.. ఫడ్నవీస్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా గతేడాది ఆక్టోబర్‌ లో నాగ్ పూర్ కోర్టును ఆదేశించింది.

ప్రజాప్రతినిధుల చట్టంలోని 125ఎ సెక్షన్ ప్రకారం ఫడ్నవీస్‌ కు నాగ్ పూర్‌‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రజా సమస్యల కోసం నిరసన తెలిపినప్పుడు రాజకీయ ప్రేరేపణతో తనపై ఆ రెండు కేసులు నమోదయ్యాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు. తనపై ఉన్న కేసులను గానీ, మరే సమాచారాన్ని గానీ దాచిపెట్టలేదని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, జరిమానాతో సరిపోయే తప్పిదానికి క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని ఫడ్నవీస్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. కానీ, తమ తీర్పును సమీక్షించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఫడ్నవీస్ కు నిరాశ తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles