farmers vs tensions: Tension previals in Amaravati అమరావతిలో ఉద్రిక్తత: రైతుల శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ..

Tension previals in amaravati as ycp activists rally continues in front of farmers protesting tents

YCP Activists, slogans, Pro Govt, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Tension previals in Amaravati, as YCP activists takes rally from krishanyapalem to nuvvuluri of Amaravati. This rally in amaravati continues from front of tents, where farmers protesting demanding amaravati as fullfledge capital creates tension.

అమరావతిలో ఉద్రిక్తత: రైతుల శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ..

Posted: 02/28/2020 04:04 PM IST
Tension previals in amaravati as ycp activists rally continues in front of farmers protesting tents

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాము ఏ ప్రాంత అభివృద్దికి వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు తామూ మద్దతునిస్తున్నామని రైతులు పేర్కోన్నారు. కానీ రాజధాని వికేంద్రీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని అశాభావంతో వున్నారు అమరావతి రైతులు.

మరో వైపు అమరావతిలో ఇవాళ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న అమరావతి రైతుల దీక్షా శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ వెళ్లడమే ఇందుకు కారణమైంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైసిపీ కార్యకర్తలు ఇవాళ ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మద్దతుగా ర్యాలీలో నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా ..రైతుల దీక్షా ప్రాంగణాల ముందు నుంచి వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.

రైతుల దీక్షా శిబిరాల వద్దకు రాగానే ‘జై జగన్‌’ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. అందుకు ప్రతిగా రైతులు, మహిళలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ర్యాలీ దృష్ట్యా మందడం, వెలగపూడిలో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేయాలని కోరుతూ 73 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. తమ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా ర్యాలీ నిర్వహించిన నేతలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles