Pregnant woman delivers miracle baby. after mob attack సీఏఏ అల్లర్లు: మిరాకిల్ బేబికి జన్మనిచ్చిన యువతి

Delhi woman delivers miracle baby hours after being attacked and kicked in the stomach by rioters

Shabana Parveen, miracle baby, CAA Protests, Delhi violence, Delhi Riots, delhi clashes, Anurag Thakur, BJP, delhi burning, delhi police, delhi riots, delhi riots today, Delhi violence, delhi violence deaths, Kapil Mishra, northeast delhi protests, Delhi violence, clash in delhi, northeast delhi riots, Citizenship amendment act, Narendra Modi, Amit Shah, National Politics, Crime

For 30-year-old Shabana Parveen, it was nothing short of a miracle -- giving birth to a healthy baby boy after surviving a murderous attack by rioters who kicked and assaulted her and her husband in northeast Delhi's Karawal Nagar.

సీఏఏ అల్లర్లు: మిరాకిల్ బేబికి జన్మనిచ్చిన యువతి

Posted: 02/28/2020 03:07 PM IST
Delhi woman delivers miracle baby hours after being attacked and kicked in the stomach by rioters

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న రేగుతున్నఅల్లర్లు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అల్లర్ల మాటును అందోళనకారులు కనీసం తాము మనుషులం అన్న ఇంకితాన్ని కూడా మర్చిపోయారు. సీఏఏ చట్టానికి అనుకులమా.? వ్యతిరేకమా.? అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఓ నిండు గర్భిణి వుంటే ఇంట్లో అమె భర్తపై చేయిచేసుకుని.. ఇంటిపైబడి  ఇంటిని తగులబెట్టారు. అలా చేయకండీ అంటూ భర్త ప్రాణాలు కాపాడేందుకు ఆందోళనకారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా భర్తను గాయపర్చారు.

ఇంతవరకు సరే కానీ.. తన భర్తను వదిలిపెట్టమని వేడుకున్న గర్భిణిని కూడా వదలకుండా.. అమె కడుపులో బలంగా తన్ని వెళ్లిపోయారు. అలా వారి చేతిలో గాయపడిన గర్భిణికి నొప్పులు మొదలై, ఓ బిడ్డను ఆమె ప్రసవించింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డను వైద్యులు 'మిరాకిల్ బేబీ'గా ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఆ బిడ్డ క్షేమంగానే వుంది. బిడ్డ పుట్టిన ఆనందం ఆ కుటుంబంలో వున్నా.. అంతకుమించిన విషాదం వారిని వెన్నాడుతోంది. ఈశాన్య ఢిల్లీలోని కరావాల్ నగర్ లో వున్న వారి ఇళ్లు.. ప్రస్తుతం పూర్తిగా అందోళనకారుల చేతుల్లో ధ్వంసమైంది. వారు పెట్టిన నిప్పుతో దగ్ధమైంది.

ఈ నేపథ్యంలో పుట్టిన బిడ్డను తీసుకుని ఎక్కడకు వెళ్లాలని.. కదిలిస్తే చాలు కళ్ల వెంట కారుతున్న కన్నీళ్లతో తమ బాధను, అవేదనను, అందోళనను వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, పర్వీనా (30) అనే యువతి ఫ్యామిలీ ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటిపై దాడి చేసిన కొందరు నిరసనకారులు, ఇంటిని తగులబెట్టారు. పర్వీన్ ను, ఆమె భర్తను దారుణంగా హింసించారు. ఆమె గర్భవతని కూడా చూడకుండా కడుపులో తన్నారు. "మా ప్రాంతంలో మత విద్వేషాలు వెల్లువెత్తాయి. నా కుమారుడిని, కోడలిని కొట్టారు. కోడలు కడుపులో బలంగా తన్నారు. నేను కాపాడేందుకు వెళితే నాపై కూడా దాడి చేశార’’ని అమె తెలిపారు.

‘‘ఆ రాత్రి ఎలా తెల్లారుతుందోనని ఎంతో భయపడ్డాం. దేవుడి దయవల్ల ప్రాణాలతో తప్పించుకోగలిగాము" అని పర్వీన్ అత్త నసీమా జాతీయ మీడియాకు వెల్లడించారు. ఆ వెంటనే నొప్పితో బాధపడుతున్న పర్వీన్ ను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళితే, పరిస్థితి విషమంగా ఉందని, హింద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారనన్నారు. అయితే హింద్ అసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు తమ కోడలికి శస్త్రచికిత్స చేశారన్నారు. దీంతో తమ కోడలు పండంటి బిడ్డ పుట్టాడని అన్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన తరువాత ఎక్కడికి వెళ్లాలో తమకు అర్థం కావడం లేదని నసీమా వాపోయారు. తాము సర్వస్వాన్నీ కోల్పోయామని, ఏమీ మిగల్లేదని, ఎవరైనా బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశ రాజధానిలోనే ఇన్నేళ్లుగా వుంటున్నాం.. ఇప్పుడీ రాజధాని తమది కాకుండా పోయిందని అమె వాపోయారు. కాగా, ఇప్పటివరకూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 38 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. నిరసనకారులు ఇళ్లను, షాపులను, వాహనాలను తగులబెట్టారు. ఓ పెట్రోల్ బంక్ ను ధ్వంసం చేశారు. ముఖ్యంగా జఫ్రాబాద్, మౌజ్ పూర్, బాబర్ పూర్, యమునా విహార్, భజన్ పురా, చంద్ బాగ్, శివ్ విహార్ ప్రాంతంలో అల్లర్లు అధికంగా జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles