Donald Trump, Melania pay homage to Mahatma Gandhi రాజ్ ఘాట్ లో గాంధీజీకి ట్రంప్ దంపతుల నివాళి..

President trump along with wife melania reach hyderabad house

US president, Donald Trump, Melania Trump, Raj Bhavan, Raj Ghat, Mahatma Gandhi, pay Homage to Mahatma Gandhi, president house, guard of honour, hyderabad house, Politics

After paying tribute to Mahatma Gandhi at Raj Ghat, US President Donald Trump and wife Melania Trump reached Hyderabad house and was received by Prime Minister Narendra Modi.

రాజ్ ఘాట్ లో గాంధీజీకి నివాళి.. మొక్కనాటిని ట్రంప్ దంపతులు

Posted: 02/25/2020 12:26 PM IST
President trump along with wife melania reach hyderabad house

తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతుల పర్యటన రెండో రోజు కొనసాగుతొంది. ఇవాళ ఉదయమే ట్రంప్ దంపతులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయన సతీమణి ట్రంప్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా వీరితో వున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జయశంకర్, హర్షవర్థన్ తదితరులు పాల్గోన్నారు.  

అనంతంర ఆయన తన సతీమణి మెలానియా ట్రంప్ తో కలసి మహాత్మాగాంధీ సమాధి కొలువైన రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. రాజ్‌ఘాట్లోని సమాధిని సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ సమాధి వద్ద ట్రంప్ దంపతులు పుష్పగుచ్ఛాన్ని ఉంచి నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా రాజ్‌ఘాట్ కు వచ్చిన ట్రంప్ దంపతులు గాంధీజీ సమాధిని సందర్శించి అక్కడ ఓ మొక్కను నాటారు. అనంతరం సందర్శకులు పుస్తకంలో తన సందేశాన్ని రాశారు.

‘‘మహాత్ముడి అలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైన భారత్ దేశానికి అమెరికా ప్రజలు ఎప్పుడూ అండగా వుంటారని.. ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం’’ అని రాసుకోచ్చిన ఆయన దాని కింత తన సంతకాన్ని కూడా పొందుపర్చారు. అనంతరం ట్రంప్ దంపతులు హైదరాబాద్ హౌస్ కు వచ్చారు. అక్కడ వారికి ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. కాగా, హైదరాబాద్ హౌజ్ లో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కాగా రాజఘాట్ సందర్శనలో ట్రంప్ దంపతుల వెంట కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh