CAT cancels IRS officer Jasti Krishna Kishore's suspension జగన్ సర్కారుకు షాక్.. జాస్తి సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్

Cat cancels irs officer s suspension allows him to return to central services

AP Government, Jasti Krishna Kishore, Central Administrative Tribunal, CEO, AP Economic Development Council, TDP government, Andhra Pradesh, Politics

The Central Administrative Tribunal has given a rude shock to the YSRCP government headed by chief minister Jagan Mohan Reddy over the suspension of the IRS officer Jasti Krishna Kishore. The CAT has ordered the Jagan's government to cancel the suspensions orders.

జగన్ సర్కారుకు షాక్.. జాస్తి సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్

Posted: 02/25/2020 01:33 PM IST
Cat cancels irs officer s suspension allows him to return to central services

కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ లో ఆంధ్రప్రదేశ్‌ అధికార వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి అరోపణలపై సస్పెన్షన్ విధించిన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ సర్వీసును క్రమబద్దం చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యూనల్‌ అనుమతిచ్చింది. కృష్ణ కిశోర్ పై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబి) డీజీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కృష్ణ కిశోర్‌ ఎకనామిక్ డెవిలప్ మెంట్ కౌన్సినల్ సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది.

కృష్ణ కిశోర్‌ నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని.. ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరు నెలల్లోగా  విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిశోర్‌ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణ కిశోర్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్‌.. ఇవాళ తుది తీర్పు వెలువరిస్తూ.. ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యూనల్ అనుమతినిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles