Man gets death for rape, murder of 6-year-old చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిని చిదిమేసిన దోషికి..

Special court sentences man to death for rape murder of five year old in andhra pradesh

six-year-old-girl rape case in chittoor, death sentence cases in andhra pradesh, Angallu, POCSO Act, Madanapalle rape case, death sentence to convict, death sentence, posco act Mohammad Rafi, death sentence Mohammad Rafi, posco act, Mohammad Rafi, Convict, death sentence, Angallu, Madanapalle, chittoor, andhra pradesh, crime

The First Additional District Court in Chittoor awarded the death sentence to accused Mohammad Rafi (27) in the sensational rape and murder of a six-year-old-girl. The incident took place on the night of November 6 at a function hall at Angallu village, near Madanapalle. The entire trail process of arresting the accused, filing charge sheet was completed in 100 days.

చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. చిన్నారిని చిదిమేసిన దోషికి..

Posted: 02/25/2020 11:58 AM IST
Special court sentences man to death for rape murder of five year old in andhra pradesh

చిత్తూరు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అభంశుభం తెలియని అమాయక చిన్నారిని చిదిమేసిన మానవమృగానికి శిక్షను ఖరారు చేసి వెలువరించింది. పెళ్లికని తల్లిదండ్రుల వెంట వచ్చిన చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు అమెను తిరిగిరానీ లోకాలకు పంపిన కామాంధుడికి మరణశిక్షే సరైన శిక్షగా తీర్పును వెలువరించింది. చిన్నారిపై జరిగిన దారుణాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు సవాలుగా తీసుకుని నాలుగు రోజుల్లో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని.. కేవలం 17 రోజుల వ్యవధిలో చార్జీషీటు దాఖలు చేశారు.

దీంతో పాటు కేసులో ఆధారాలను సమకూర్చడం, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలను న్యాయస్థానానికి సమకూర్చడంతో చిత్తూరులోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ సంచలన తీర్పు వెలువరించింది. చిత్తూరు జిల్లాలో పోస్కో చట్టం కింద నమోదైన తొలి కేసును కేవలం వంద రోజుల వ్యవధిలో విచారణను ముగించి.. శిక్షను వెలువరించారు. కేసు విచారణ సంరద్భంగా న్యాయమూర్తి.. 41 మంది సాక్ష్యుల వాంగ్మూలన్ని నమోదు చేసుకున్నారు. ఆయన నిందితుడైన మహ్మద్‌ రఫీకి  నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)ని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.

 వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్‌ 7న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుక కోసం జిల్లాలోని కురబలకోటకు వెళ్లింది. ఈ క్రమంలో నిందితుడు మహ్మద్‌ రఫీ.. బాలికకు మాయ మాటలు చెప్పి కల్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనపై తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా న్యాయస్థానం 47 మంది సాక్షులను విచారించింది. దోషిగా తేలిన అనంతరం ఈరోజు మహ్మద్‌ రఫీకి మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : posco act  Mohammad Rafi  Convict  death sentence  Angallu  Madanapalle  chittoor  andhra pradesh  crime  

Other Articles