nityananda new video goes viral online ‘‘నా తదనంతరం నా అస్తులు వారికే..’’ నిత్యానంద కొత్త వీడియో

Nityananda new video on will and his last rites goes viral online

controversial godsman, nityananda swami, new video goes viral online, kailasam, last rites, will, tamil nadu, janardhan sharma, daughters, Crime

Controversial self proclaimed godsmen nityananda alias rajashekaran has surfaced in to a new controversy in a latest released video, in which he has written about who should own his assets after his death.

‘నా తదనంతరం నా అస్తులు వారికే..’’ నిత్యానంద కొత్త వీడియో

Posted: 02/24/2020 11:45 AM IST
Nityananda new video on will and his last rites goes viral online

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు పేరొందిన నిత్యానంద స్వామి అలియాస్ రాజశేఖరన్ కోసం ఓ వైపు పోలీసులు.. ఇంటర్ పోల్ అధికారుల సాయంతో గాలిస్తున్నారు. కాగా మరోవైపు కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఆయన ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారని న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోంది. ఈ నేపథ్యంలో ఆయనకు చెందినదిగా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తన తదనంతరం తనకు చెందిన ఆస్తులు, ఇతరాత్ర వ్యవహారాలను ఎవరూ చూసుకోవాలన్న విషయమై ఆయన తన తాజా వీడియోలో వెలువరించారని ప్రచారం జరుగుతోంది.

బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ...  తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో నిత్యానంద  పై పోలీసులు కిడ్నప్ కేసును నమోదు చేసారు. దానికంటే ముందు ఆయన పై చాలా కేసులు ఉన్నాయి. దాంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన అజ్ఞాతం లోకి వెళ్లారు. దాంతో నిత్యానందను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సహాయం కోరారు గుజరాత్ పోలీసులు. అయినా నిత్యానంద ఆచూకీ దొరకలేదు.. ఇదిలా ఉంటే  ఆమధ్య తాను ఒక కొత్త దేశాన్ని నిర్మిస్తున్నానని ఒక దీవిలో నిర్మిస్తున్న ఈ దేశానికి కైలాసం అనే పేరు పెడుతున్నానని నిత్యానంద ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి.

తాజాగా కైలాసం కు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తనకు తమిళనాడులో ఎలాంటి పనిలేదని, తాను అరవ రాష్ట్రానికి రానని వెల్లడించాడు. తన రెండు దశాబ్దాల శ్రమ ఇప్పటికీ గానూ పూర్తైందని పేర్కోన్నారు. క్రైస్తవులకు వాటికన్ సిటీ వున్నట్లుగానే, హిందువులకు ఓ నగరం వుండాలన్న తన స్వప్నం ఇన్నాళ్లకు సాకారమైందని ఆయన ఈ వీడియోలో చెప్పుకోచ్చారు. తాను మరణించిన తరువాత.. తాను సూచించి పద్దతులు, విధాలనాల ప్రకారం తన అంత్యక్రియలు, ఖనన సంస్కరణాలు నిర్వహించాలని సూచించారు. మధురైలోని బిడది ఆశ్రమంలో ఖననం చేయాలని తెలిపాడు. కాగా పోలీసులు అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles