KCR government fails to keep up poll promises ‘‘ఇబ్బడిముబ్బడి హామీలు.. ఏఢాది గడిచినా నీటిమూటలు..’’

Kcr government fails to keep double bed room promise

Revanth Reddy, Patnam Gosa, TRS poll promises, KCR government, double bedroom houses, Hyderabad elections, Prime Minister Awas Yojana, G Kishan Reddy, Telangana, Politics

Inspite of making many promises to people of Telangana, the Ruling KCR government has failed to keep up its promise, critisizes congress senior leader Revanth Reddy. double bedroom houses a complete failure in the state. He says congress will launch a programme demanding to fullfill promises.

‘‘ఇబ్బడిముబ్బడి హామీలు.. ఏఢాది గడిచినా నీటిమూటలు..’’

Posted: 02/24/2020 12:37 PM IST
Kcr government fails to keep double bed room promise

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల బతుకులంటే పరచకమైందని..  మాయమాటలు, నీటి మూటల హామీలతో కాలం గడపడంలో దిట్టగా మారుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పట్నం గోస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న తరువాత బోడ మల్లన్న అన్నట్లు.. ఎన్నికల ముందు మాత్రం ప్రజలే తనకు సర్వసం అంటూ మాట్లాడే ముఖ్యమంత్రి ఎన్నికలైన తరువాత ప్రజలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఖాజానాను ఖాళీ చేసి.. నామమాత్రపు అభివృద్ది చేసిన ముఖ్యమంత్రి అక్రమంగా సంపాధించిన నిధులతో ఎమ్మెల్యేలను, ఎన్నికలలో ఓట్లను కొంటున్నారని అరోపించారు. తాజాగా మరోమారు అక్రమంగా సొమ్ముతో ప్రజల ముందుకు వస్తున్నారని.. ఈ విషయంలో నగర ప్రజలు ఎంతో తెలివైనవారని ప్రభుత్వానినిక తెలియజేయాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భూదేవినగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన.. అనంతరం మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి పేరుతో మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ పాలమూరు వెళ్లారన్నారు. ప్రజల కోసం అవసరమైతే కేసీఆర్ గల్లా పట్టి గుంజాడనికైనా తాను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పి పట్టించుకోలేదన్నారు. పేదల ఇళ్ల కోసం కేసీఆర్‌, మోదీతో కొట్లాడుతానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట తప్పారని రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు. ఎర్రవల్లి చింతమడకకు ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రజలను కెసిఆర్‌ మోసం చేసిన తీరును ఎండగడతామని అన్నారు. కాంట్రాక్లర్లకు 900 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి అని అన్నారు. కాంగ్రెస్‌ హయంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles