Newborn Baby Frowns At Doctor ఫోటో వైరల్: డాక్లర్లను ఉరిమిచూసిన అప్పుడే పుట్టిన శిశివు..

Newborn baby shows her frowning at doctor who tries to make her cry

Newborn Baby Frowns At Doctor, Rodrigo Kunstmann, Isabela Pereira de Jesus, newborn baby, Viral, World News, Awesome, Funny, Brazil

Photographer Rodrigo Kunstmann says childbirth is a unique moment that deserves to be captured. But a photograph he took last week went viral, not because it was especially life-affirming or beautiful, but because it hilariously captured one very grumpy newborn.

ఫోటో వైరల్: డాక్లర్లను ఉరిమిచూసిన అప్పుడే పుట్టిన శిశివు..

Posted: 02/24/2020 10:57 AM IST
Newborn baby shows her frowning at doctor who tries to make her cry

తల్లి గర్బంలో వెచ్చగా సేదతీరుతున్న శిశువు.. బయట పడగానే కళ్లు కూడా తెరవకుండా ఏడుపులంకించుకోవడం సర్వసాధారణంగా భావిస్తాం. ఇక కళ్లు తెరిచి చూడటానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుంది. ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించిందో శిశువు. తల్లి గర్బంతో తన మానాన తాను వుంటే ఎందుకు బయటకు తీసారన్నట్లు.. పురుడుపోసిన డాక్టర్ వైపు కోపంగా ఉరిమిచూసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివారాల్లోకి వెళితే..బ్రెజిల్ లోని రియో డీజనీరోలో ఫిబ్రవరి 13న ఓ మహిళకు డాక్టర్లు డెలివరీ చేసారు.

ఆమె పండండి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను డాక్టర్లు బొడ్డుతాడు కోసి ఏడిపించటానికి ప్రయత్నిస్తుండగా..ఆ శిశువు ఇచ్చిన రియాక్షన్‌కు డాక్టర్లు షాక్ అయ్యారు. కంగుతిన్నారు. ఆ బిడ్డ డాక్టర్లవైపు కోపంగా చూస్తున్నట్లుగా ఉంది. డాక్టర్లు ఆ బిడ్డ ఎక్స్ ప్రెషన్ ను ఫోటో తీసారు. ఈ ఫోటో తాజాగా వెలుగులోకి రావటంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం..ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు.

దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ శిశువు డాక్టర్లవైపు ఎంతో కోపంతో ఉరుముతున్నట్టు చూసింది. మొదట ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు కంగుతిన్నప్పటికీ తరువాత తేరుకున్నారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉందనీ..ఎటువంటి సమస్యలు లేవని..కాసేపటికి ఆ శిశువు సాధారణ శిశుల్లాగానే ఉండటంతో బిడ్డ తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles