Sujana's Rs 400 cr assets up for auction! బీజేపి నేత ఎంపీ సుజనకు బ్యాంకు షాక్.. ఆస్తుల వేలం..

Bank of india to auction bjp mp sujana chowdary assets

Y Sujana Chowdary, TDP, former union minister, BJP, Rajya Sabha MP, Bank of India, Assets, Auction, Sujana Universal Industries Ltd, National Politics

A Bank of India branch in Chennai gave notice to Rajya Sabha member Sujana Chowdary for auctioning his assets on March 23 to recover Rs 400 crore loan taken for business purpose. In the notice, it said that those interested can verify the assets located in various places in and around Chennai on or before March 20.

బీజేపి నేత ఎంపీ సుజనకు బ్యాంకు షాక్.. ఆస్తుల వేలం..

Posted: 02/21/2020 01:34 PM IST
Bank of india to auction bjp mp sujana chowdary assets

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి బ్యాంకులు షాకిచ్చాయి. రుణ ఎగవేతకు సంబంధించిన అంశంలో ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది. ఆ బ్యాంక్‌ నుంచి 2018 అక్టోబర్‌ 26వతేదీన రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై తీసుకున్న యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి సంస్థ సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రుణాన్ని తిరిగి చెల్లించకుండా మొండికేస్తోంది. అసలు, వడ్డీ కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి రుణం రూ.400.84 కోట్లకు చేరింది.

తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా.. నోటీసులు ఇచ్చినా బీజేపి నేత సుజనా చౌదరి స్పందించలేదు. దీంతో మరోమార్గం లేకపోవడంతో ఆయన తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు నోటీసు జారీ చేసింది. ఆన్ లైన్ లో బిడ్ ల దాఖలుకు తుది గడువు మార్చి 21గా పేర్కొంది. ఈ–ఆక్షన్‌ విధానంలో ఆస్తులను మార్చి 23న 11.30 నుంచి 12.30 గంటల మధ్య వేలం వేస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించడంతో సుజానా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.  

సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్, సుజనా మెటల్‌ ప్రొడక్ట్, సుజనా టవర్స్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్ టోనిక్స్‌ కూడా లిస్టెడ్‌ కంపెనీయే. మరో 4 కంపెనీలు మినహా మిగిలినవన్నీ షెల్‌ కంపెనీలే. ఇవి సర్క్యులర్‌ ట్రేడింగ్, బుక్‌ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు సీబిఐ, ఈడీ సహా పలు దర్యాప్తు సంస్థలు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాయి. సుజనా  గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles