chain snacther held after victim holds his hand ఉడుం పట్టుతో చైన్ స్నాచర్ కు చుక్కలు చూపించిన మహిళ..

Chain snacther held after victim holds his hand in narsingi policestation limits

janwada Chain snatching, Chain snatcher woman, Narsingi Chain snatching, Chain snatching narsingi police, janwada, Chain snatcher, woman, Narsingi, Cyberabad police, Telangana, Crime

chain snacther held after victim holds his hand in narsingi policestation limits of cyberabad police commissionerate. woman who acted bravely was appreciated by locals and police.

ఉడుం పట్టుతో చైన్ స్నాచర్ కు చుక్కలు చూపించిన మహిళ..

Posted: 02/21/2020 12:51 PM IST
Chain snacther held after victim holds his hand in narsingi policestation limits

దొంగను చూస్తేనే కొందరు హడలిపోతారు.. ఇంకోందరు బెదిరిపోతారు. కానీ తెగువను ప్రదర్శించేవారే తమను తాము కాపాడుకోగులుగుతారు. తాము చేసే సాహసమే తమను ప్రమాదం నుంచి గట్టు ఎక్కిస్తుందని ఆనక తెలుసుకుంటారు. అచ్చంగా ఈ మహిళ మాదిరిగా. ఓ చైన్ స్నాచర్... తన చైన్‌ పట్టుకొని లాక్కెళ్తుంటే.. ఆ దొంగ చేతిని అమె గట్టిగా పట్టుకుంది.. దొంగ అమెను కొంత దూరం లాక్కెళ్లినా.. అమె కిందపడింది. అయినా అతని చేయిని మాత్రం వదల్లేదు. జనాలు వచ్చి దొంగను పట్టుకునే వరకు.. నిందితుడు కటకటాలు లెక్కపెట్టించే వరకు అతని చేయిని వదల్లేదు.

వివరాల్లోకి వెళ్తే..  హైదరాబాద్ శివారులో గండీపేట్-శంకర్ పల్లి వెళ్లే దారిలో వున్న జన్వాడ గ్రామంలో రోడ్డుపై ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అమెను టార్గెట్ చేసిన ఓ చైన్ స్నాచర్.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో షాక్ కు గురికావాల్సిన మహిళ.. తేరుకుని తెగవను చూపింది. వెనువెంటనే స్పందించిం దొంగ చేతిని పట్టుకుంది. దొంగ తనకు చిక్కిన బంగారు గొలుసుతో పరారయ్యేందుకు యత్నించినా ఉడుం పట్టులా చైన్ స్నాచర్ చేతిని వదల్లేదు.

ఈ పెనుగులాటలో అమె కిందపడింది. అయినా దొంగ చేతిని వదల్లేదు. దొంగ దొంగా అని కేకలు వేయడంతో.. బంగారు గొలుసు దక్కకపోయినా ఫర్వాలేదు.. ముందు తప్పించుకోవాలని దొంగ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దొంగ తప్పించుకోవాలని చూసినా అమె వాడి చేతిని వదలకపోవడమే అందుకు కారణం. ఇక పెద్దగా అరవడం ప్రారంభించింది. దీంతో రోడ్డున వెళుతున్నవారు.. కాసింత దూరంలో వున్నవారు అక్కడికి చేరుకుని చైన్ స్నాచర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janwada  Chain snatcher  woman  Narsingi  Cyberabad police  Telangana  Crime  

Other Articles

Today on Telugu Wishesh