Lion climbs on top of car full of tourists at safari park వైరల్ వీడియో: కారు ఎక్కి.. డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నం..

Lions scare tourists by climbing on top of car at safari park

Lion climbs on top of car full of tourists at safari park, Old video goes viral, safari park video viral, lion climbs on top of the car, safari tourist, twitter, wild animals, lion climb car, lion climb, lions, south africa, viral video, video viral

Lion climbs on top of car full of tourists at safari park. A video of a lion sitting on top of a car full of tourists at a safari park has gone viral. Lion climb the top of the car safari tourist twitter, Lion climbs into safari car full of tourists in Crimea

ITEMVIDEOS: వైరల్ వీడియో: కారు ఎక్కి.. డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నం..

Posted: 02/21/2020 02:39 PM IST
Lions scare tourists by climbing on top of car at safari park

సఫారీ పార్క్ లో సింహాలు కనబడితే చూసి ముచ్చటపడని వారు వుండరు. కానీ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా వుంటే ఎంతసేపైనా నిరీక్షిస్తాం.. అలా కాకుండా ఏకంగా మన ప్రయాణిస్తున్న కారు పైకి ఎక్కి పరిశీలిస్తే.. కారులో వున్నవారందరికీ గుండెల్లో రైల్లు పరిగెత్తడం గ్యారంటీ. అది చాలదన్నట్లు కారు డోర్ కూడా ఓపెన్ చేయాలని చూస్తే మాత్రం కూర్చున్నసీటును తడిపేసుకోవడం గ్యారంటీ. అలాంటి ఘటనే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. వాహనాలను వెంబడించడం గమనిస్తూనే ఉంటాం. ఇంతకుముందు కూడా దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి.  తాజాగా ఒక సింహం కారు మీదకు ఎక్కి కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో సింహం దర్జాగా ఒక కారు మీదకు ఎక్కి కూర్చుంది. తర్వాత కారు డోర్‌ ఓపెన్‌ చేయాలని ప్రయత్నించినా డోర్‌ లాక్‌ చేసి ఉండడంతో ఓపెన్‌ కాలేదు. దీంతో కొద్దిసేపటి వరకు కారుపై అలాగే ఉండిపోయింది. అయితే అదే సమయంలో  మరో రెండు సింహాలు వచ్చి కారును మొత్తం పరిశీలించాయి.

ఈ నేపథ్యంలో కారు డ్రైవర్‌ మెల్లగా తన వాహనాన్ని కదిలించడంతో సింహం కిందకు దిగి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. సఫారీ పార్క్‌కి వెళ్లే వీక్షకులు తమ సొంత వాహనాల్లో వెళితే ఎంత ప్రమాదకరమనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియోనూ రెడ్డిట్‌ అనే సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ' అదృష్టం బాగుంది కాబట్టి ఆ సింహాలు కారును ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఒకవేళ వాటికి చిర్రెత్తికొచ్చి కారుపై దాడి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకమీదట సఫారీ పార్క్‌కు వెళ్లేవారు సొంత వాహనాల్లో కాకుండా బస్‌లో వెళితే బాగుంటుందని నెటిజన్లు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles