Devotees throng temples to offer prayers on Maha Shivratri దేశవ్యాప్తంగా శివోహం.. మార్మోగుతున్న శివనామస్మరణం

Devotees across the country throng temples to offer prayers on maha shivratri

Maha Shivratri, Maha Shivratri devotees, Maha Shivratri temple, Maha Shivratri today, Maha Shivratri friday, maha shivratri. Shivalay, jyothirlingas, devotees crowd, devotees

Sea of devotees on Friday morning throng temples of Lord Shiva in several parts of the country to offer prayers on the occasion of Maha Shivratri. Devotees visited Srisailam, Srikalahasti, Vemulavada Rajanna, Keesara, komravelli, Temples in Telugu states to offer prayers.

దేశవ్యాప్తంగా శివోహం.. మార్మోగుతున్న శివనామస్మరణం

Posted: 02/21/2020 10:58 AM IST
Devotees across the country throng temples to offer prayers on maha shivratri

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు పురాతన శివాలయాలకు భక్తులు పొటెత్తారు. ఇటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది.

ఇక తెలంగాణలోని వేములవాడ రాజన్న దేవాలంయంతో పాటు కీసరలోని రామలింగేశ్వరాలయం, కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయం, పటాన్ చెరువు బీరంగూడలోని భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవుడికి పూజలు అందిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో నీలకంఠుడి పట్ల ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ‘ఓం నమ: శివాయ’ మంత్రోచ్చరణతో ఆ త్రినేత్రుడి యందు మనసుని లగ్నం చేసి తన్మయత్వం పొందుతున్నారు. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు.

రాజరాజేశ్వరుడి ఆలయానికి భక్తుల తాకిడి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు  అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వేములవాడ జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి రాజన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం త‌ర‌ఫున అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శ్రీవెంక‌టేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. శివ‌రాత్రి మ‌హోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మ‌హా శివ‌రాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలకు భారీగా భక్తజనుల తాకిడి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వరాలయం, వారణాసీలోని కాశీ విశ్వనాధస్వామి సహా శ్రీశైలం, మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర ఆలయం, చార్ ధామ్ లుగా ప్రసిద్ది చెందిన శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maha shivratri. Shivalay  jyothirlingas  devotees crowd  devotees  srisailam  sriKalahasti  

Other Articles