Patience is most needed to bring change in system: Pawan Kalyan మార్పు కోసం సహనం అవసరం: పవన్ కల్యాణ్

Patience is most needed to bring change in system pawan kalyan

Pawan Kalyan, JanaSena, Indian Student Parliament, patience, change in system, Rs 1 crore donation, Army Flag Day. welfare of armymen''s families, Kargil war, Vignan Bhavan, Indian Students Parliament, Delhi, BJP, Andhra Pradesh, Politics

Janasena Party leader and Telugu film star Pawan Kalyan on Thursday had impressed the delegates and youth at Indian Student Parliament at Vignan Bhavan in New Delhi with his speech. The JanaSena chief Said good ideology and organised planing along with Patience is needed to bring change in system.

మార్పు కోసం సహనం అవసరం: పవన్ కల్యాణ్

Posted: 02/20/2020 07:32 PM IST
Patience is most needed to bring change in system pawan kalyan

దేశానికి సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీ స్థాపించి.. పోరాటాలు చేస్తున్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తన రాజకీయ ప్రస్తానం కొమ్ములు తిరిగిన పార్టీలను ఢీకొడుతూ పరాజయంతో ప్రారంభమైనా.. ధన ప్రభావం తీవ్రంగా గల ఎన్నికల వ్యవస్థలో మార్పు కోసం.. యువతను మార్చుకునే విధంగానే సాగుతోందని అన్నారు. తాను గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని.. లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌’ సదస్సులో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. భగత్‌ సింగ్ లాంటి వారు తనకు ఆదర్శమని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయాలను చూస్తూ పెరిగానని.. అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానన్నారు. యువతలోని ఆవేశాన్ని అర్థం చేసుకుని వారితో మాట్లాడానని చెప్పారు. వ్యవస్థలో వేళూనుకున్న పలు ప్రభావాలు ఎన్నికల సమయంలో ఓటర్లపై త్రీవంగా పరిణమిస్తున్నాయని వాటి నుంచి యువతను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.

రాజకీయంగా తమకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారని.. కానీ, తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. కర్నూలులో సుగాలి ప్రీతి మృతి విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహించామని.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిందని పవన్‌ గుర్తు చేశారు. సినిమాల్లో అయితే రెండు మూడు నిమిషాల్లో సాధ్యమవుతుందని.. పోరాటంలో విజయం సాధించవచ్చునని కానీ.. నిజ జీవితంలో అది సాధ్యం కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటే సహనం కావాలని, కొన్నేళ్ల పోరాటంతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యాచరణతో లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే.. మార్పు రావాలని, అందుకోసం యువత కనీసం 15 ఏళ్లు వేచి చూడాలని అన్నారు. మార్పు వెంటనే కావాలనుకుంటే రాదని అభిప్రాయపడ్డారు. ఓటములు ఎదురైనా దేశ సేవ కోసం ఓపికతో ముందుకు సాగుతున్నాని చెప్పారు. యువత క్షేత్రస్థాయి వాస్తవాలను అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఇన్ స్టంట్‌ నూడుల్స్ లా వెంటనే ఫలితం కావాలని కోరుకోవద్దు. వివిధ వర్గాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా మనమంతా ఒకే దేశం నినాదంతో ఐక్యంగా ఉన్నాం’’ అని పవన్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Indian Student Parliament  vignan bhavan  speech  Andhra Pradesh  Politics  

Other Articles