లేటు వయస్సులో తనకు మగబిడ్డ కావాలన్న కోరిక పుట్టింది. కృతిమ గర్భం ద్వారా అది సాధ్యమని ఓ మిత్రుడు చెప్పడంతో ఆ పద్దతిలో బిడ్డను కనేందుకు సై అన్నాడు. ఓ యువతితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఆ తరువాత కృతిమ పద్దతుల్లో ఎందుకు సహజంగా.. తనతో బిడ్డను కనాలని.. అమెను వేధించాడు. మగబిడ్డ కావాలంటూ వచ్చి మృగంలా మారుతున్న ముసలాడికి తాను అందుకు అంగీకరించనని చెప్పింది. అయినా ప్రతీనిత్యం ఇదే విషయమై వేధించడంతో అమె పంజాగుట్ట పోలీసులకు పిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్రాంతానికి చెందిన స్వరూప రాజ్ వయసు 64 ఏళ్లు. ఈయనకు ముగ్గురు సంతానం. ముగ్గురూ ఆడబిడ్డలే. ఇన్నాళ్ల పాటు వారిని పెంచి, పోషించి, పెళ్లిళ్లు చేసి పంపించాడు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక తాను తన భార్య మాత్రమే ఎందుకు వుండాలని అనుకున్నాడో.. ఏమో తెలియదు. తనకు కొడుకు వుంటే వాడి భార్య.. పిల్లలతో హ్యాపీగా వుండవచ్చు కదా.. లేక చివరి దశకు చేరుతున్న క్రమంలో తనకు బిడ్డ వుంటే తన మంచి చెడులు చూసుకుంటాడని అనుకున్నాడో.. కానీ మగ బిడ్డ కావాలని పూనుకున్నాడు.
తనలోకి కోరికను తన స్నేహితుడైన నూర్ తో చెప్పాడు. అయితే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనవచ్చని చెప్పాడు నూర్. అయితే అందుకు ఓ మహిళ అవసరం ఉంటుందని కూడా చెప్పాడు. అయితే కృతిమ గర్భదారణకు యువతిని చూడాలని కోరాడు. నగరానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతిని తీసుకువచ్చి సరోగస్సీకి సరేననిపించాడు నూర్. ఇందుకు గాను యువతితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో పాటు డెలివరీ అయ్యే వరకు ప్రతీ నెల మందులు, ఆహారం ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయల కూడా చెల్లిస్తానని అంగీకరించాడు.
ఇలా ఒప్పందం చేసుకున్న తరువాత స్వరూప్ రాజ్ లో మృగం నిద్రలేచింది. యువతితో కృత్తిమ గర్భం ఎందుకు.. నేరుగా తనతో మగబిడ్డను కనవచ్చు కదా.? అన్న యువతిని కోరాడు. దీనికి యువతి కుదరదని చెప్పింది. అయినా పదే పదే ఈ విషయాన్ని అలోచించాలని వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి కూడా వేధించడం ప్రారంభించాడు. తాను తన కూతరు వయస్సు కన్నా చిన్నదాన్ని అని యువతి చెప్పినా వినిపించుకోలేదు. విసుగుచెందిన యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వరూపరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్ లో ఈ ఘటన జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more