Pawan Kalyan slams ap govt for decieving farmers ప్రభుత్వమే రైతులను మోసం చేసింది: పవన్ కల్యాణ్

Pawan kalyan slams andhra pradesh government for decieving farmers

Janasena, BJP, Pawan kalyan, Pawan Kalyan, JanaSena, Farmers, agri products, food grains, amount, Vijayawada, Amaravati, Visakhapatnam, wrong propaganda, defamation suit, social media, false articles, farmers, Capital city, Amaravati, agitation, Nadella Manohar, Sunil Deodhara. GVL Narasimha Rao, Amaravati, Visakhapatnam, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

Jana Sena chief Pawan Kalyan alleges that the government which had given promise to farmers had decieved them. He alleges that government said to pay them their crop product amount within 48 hours, but did not stand by it.

హామీపై వైసీపీ ప్రభుత్వం వెనక్కు.. మోసపోయిన రైతులు: పవన్ కల్యాణ్

Posted: 02/18/2020 08:45 PM IST
Pawan kalyan slams andhra pradesh government for decieving farmers

మాట తప్పం.. మడమ తప్పం అని ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కు తగ్గిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రైతులను సులభంగా మోసం చేయవచ్చునని పదే పదే వైసీపీ ప్రభుత్వం వారినే మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం పంటను అమ్మి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ము రాక  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మోసం చేసేందుకు అన్ని ఎత్తులు వేస్తున్న ప్రభుత్వం.. ఇక తాజాగా రాష్ట్ర రైతాంగాన్ని యావత్తు మోసం చేసేందుకు సన్నధమయ్యారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.

లక్ష మందికి పైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులుపడుతుంటే సంబంధిత శాఖలేం చేస్తున్నాయని పవన్‌ నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరిచిపోయిందని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా సొమ్ము చేతికి రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఖరీఫ్‌ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Farmers  agri products  food grains  amount  AP CM Jagan  Andhra Pradesh  Politics  

Other Articles