Dubai 'Jetman' takes flight in 'major milestone' మానవ విమానంగా గాల్లో ఎగిరిన ‘జెట్ మ్యాన్’

Sheikh hamdan shares video of first autonomous human flight test in dubai

#MissionHumanFlight #JetmanDubai #ExpoDubai2020, human flight, Vince Reffet, Jetman pilot, four mini jet engines, Jumeirah Beach, Skydive Dubai, low altitude, flying aerobatics, Expo 2020 Dubai

Jetman Vince Reffet took off, headed south towards Jumeirah Beach Residence, building speed and height. In 30 seconds he had reached 1000 metres height at an average speed of 130 knots. This is the first time that a Jetman pilot has combined hovering safely at a low altitude and flying aerobatics at a high altitude in the same flight.

దుబాయ్ ఎక్స్ ఫోలో మానవ విమాన ప్రయోగం విజయవంతం

Posted: 02/18/2020 02:39 PM IST
Sheikh hamdan shares video of first autonomous human flight test in dubai

సాహో చిత్రంలో హీరో ప్రభాస్ ఓ జెట్ సూట్ వేసుకుని అమాంతంగా గాల్లోకి ఎగిరిపోయే దృశ్యం చూసిన ప్రేక్షకులకు అబ్బా ఇలాంటి సూట్ మాకు వుంటే.. హ్యాపీగా గాల్లో ఆఫీసుకు వెళ్లే వాళ్లం అనుకుంటారు కొందరు.. నచ్చిన ప్రదేశానికి అనుకున్నదే తడవుగా వెళ్లిపోవచ్చని మరికొందరు.. ప్రపంచంలోని అన్ని టూరిస్టు స్పాట్ లను కలియదిరిగి రావచ్చని ఇంకొందరు అనుకుంటారు. ఇక పర్వతాలు కానీ, నదులు కానీ ఈజీగా ఎక్కవచ్చు, దాటవచ్చుని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కావాలి కదా.. అన్న ప్రశ్న ముందుగా మనముందుకు వస్తోంది.

అదే నిజమైతే.. ఔనా.? అంటున్నారు కదూ.. ఇది నిజమే.. దుబాయ్ లోని ఎక్స్ ఫో 2020లో ఇలాంటి దృశ్యమే అవిష్కతమైంది. ఈ ఎక్స్ ఫో ప్రిన్స్ రిఫెట్ అనే పైలెట్.. జెట్ సూట్ ధరించి.. మానవ విమానంగా గాల్లో విహరించాడు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 వందల మీటర్ల మేర అకాశంలోకి విహరించాడు. మానవ విమానాలుగా గాల్లోకి ఎగిరే సాంకేతికత, దిశను మార్చుకునే కంట్రోల్, వేగాన్ని నియంత్రించే ఎక్సిలరేటర్ ఇత్యాదులన్నీ ఈ జెట్ సూట్ లో పొందుపర్చారు.

ఈ సూట్ ను కార్బన్ ఫైబర్ వింగ్ తో రూపోందించడంతో పాటు దానికి నాలుగు మిని జెట్ ఇంజన్లను అమర్చారు. ఇవి ఏకంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారు చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసే పనిలో భాగంగా పైలెట్ రెఫెట్ అరేబియా గల్స్ లో స్కై డ్రైవ్ రన్ వేపై 100 సెకన్లు పాటు నియంత్రణలు, మలుపులు, వెనుకా ముందుకు వెళ్లే బటన్లన్ని చూసుకున్నాడు. అలా తన ప్రయోగాన్ని విజయవంతంగా ముగించుకుని తిరిగివచ్చాడు. జుమూరాహ్ బీచ్ రెసిడెన్స్ వైపుగా తన ప్రయోగ ప్రయాణాన్ని సాగించి విజయవంతంగా తిరిగివచ్చాడు రెఫెట్.

ప్రయోగ ప్రారంభంలో తొలి 8 సెకన్ల పాటు వంద మీటర్లు మాత్రమే వెళ్లగా, 12 సెకన్లకు 200 మీటర్ల, 19 సెక్లనలో 500 మీటర్లు అలా 30 సెకన్లలో 1000 మీటర్లు ప్రయాణించాడు రెఫెట్.. ఆ తరువాత వేగం పుంజుకుని మూడు నిమిషాల్లో 1800 మీటర్ల దూరం ప్రయాణించాడు. కాగా 1500 మీటర్ల దూరం ప్రయాణించగానే రెఫెట్ తన ఫ్యారాషూట్ ఓపెన్ చేశాడు. 1000 మీటర్ల దూరం దాటిన తరువాత ఒక రోల్ ఒక లూప్ చేశాడు రెఫెట్. ఈ తరహాలో జెట్ సూట్ ధరించి.. తొలి మానవ విమానంగా నింగిలోకి దూసుకెళ్లిన పైలెట్ గా కూడా రిఫెట్.. ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రిఫెట్ గాల్లో ఎగురుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 
 
 
View this post on Instagram

A major milestone in the quest to achieve 100% autonomous human flight. Well done boys. #MissionHumanFlight #JetmanDubai #ExpoDubai2020

A post shared by Fazza (@faz3) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles