కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తో కలసి ఆయన చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ కు శంఖుస్థాపని చేశారు. అనంతరం గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రజలకు ఎర్రస్సులే తప్ప రైల్వే అంటే ఏమిటో కూడా తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. రైల్వే ప్రయాణం అంటే అలవాటు లేని ప్రయాణమని అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అయిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త రైళ్లు ప్రారంభించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించారని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని రైళ్లను ప్రారంభించారా.. రైల్వే లైన్లను ప్రారంభించారా.? అంటూ నిలదీస్తున్నారు ప్రజలు.
రైల్వేలు నిజాం పాలన కాలం నాటి నుంచి వున్నాయని మరికొందరు గుర్తుచేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపి నేతలు తాము తెలుగువాళ్లం అన్న విషయాన్ని మర్చిపోయి.. సొంతవారిపైనే దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఎందుకు అహాన్ని ప్రదర్శిస్తారో అర్థం కావడం లేదని.. కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. ఔనా..? నిజమా.? అంటూ విమర్శలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more