Four rob 30kg gold in Ludhiana పట్టపగలు 30 కిలోల బంగారం దోపిడీ

Day light robbery at iifl gold loan branch 25 kg gold ornaments looted in ludhiana

gold ornaments, gold ornaments looted, gold ornaments stolen, gold ornaments ludhiana, iifl punjab branch, iifl ludhiana branch, Punjab, crime

In a broad daylight robbery, five men looted over 25 kg of ornaments at gunpoint from a gold loan branch of India Infoline Finance Ltd in Ludhiana’s Gill Road area.

బరితెగించిన దొంగల ముఠా.. పట్టపగలు 30 కిలోల బంగారం దోపిడీ

Posted: 02/17/2020 06:45 PM IST
Day light robbery at iifl gold loan branch 25 kg gold ornaments looted in ludhiana

పంజాబ్ పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంగారు ఆభరణాలపై రుణాలను ఇచ్చే సంస్థను టార్గెట్ చేసిన దొంగలు 30 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ముసుగులు ధరించి సంస్థ శాఖలోకి చోచ్చుకెళ్లిన దొంగలు.. తుపాకులతో అక్కడి సిబ్బందిని బెదిరింది.. వారిని కట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలో మొత్తం ఐదుగురు దుండగులు వున్నారని సమాచారం. ఈ ఘటన ఇవాళ ఉదయం పంజాబ్ లోని లుధియానాలోని రద్దీగా వుండే గిల్ రోడ్డులో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. లుధియానాలోని గిల్ రోడ్డులో వున్న ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) శాఖకు అప్పుడప్పుడే తెరచిన సిబ్బంది ఇంకా ఫైల్స్ అన్ని సరిచూసుకునే పనిలో నిమగ్నమై వుండగానే సంస్థ శాఖలోకి నలుగురు దుండగులు ముసుగులు ధరించి లోనికి ప్రవేశించారు. వచ్చి రావడంతోనే సిబ్బందిని తుపాకులతో బెదిరించి వారి నుంచి బంగారం నిల్వవుంచిన లాకర్ తాళంచెవులు తీసుకున్నారు.

లాకర్ గదిలోకి ప్రవేశించిన దుండగులు అందులోని సుమారు 30 కిలోల బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అంతకుముందు సిబ్బందిని అదే గదిలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. ఇదంతా 20 నిమిషాల్లోనే జరిగిందన్నారు. దుండగులు అక్కడి నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్‌ఎల్‌ సిబ్బంది అలారం మోగించారని పోలీసులు చెప్పారు. చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించగా.. ఒకడు బయట కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్‌ఎల్‌ భద్రతా సిబ్బంది అక్కడ లేరని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles