Nirbhaya case: Delhi court issues fresh death warrants ‘నిర్భయ’ దోషులకు ‘ఉరి’కి పటియాల కోర్టు కొత్త తేదీ

Nirbhaya case all 4 convicts to be hanged on march 3 delhi court issues fresh warrants

Nirbhaya convicts, Execution, Justice Suresh Kait, Delhi High Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A Delhi Court had issued a death warrant against the four convicts -- Vinay Sharma, Akshay Thakur, Pawan Gupta, and Mukesh Singh -- on January 7 and they were scheduled to be executed on January 22 at Tihar Jail. Later, the execution was suspended indefinitely by a Delhi court.

‘నిర్భయ’ కేసు: దోషులకు ‘ఉరి’కి పటియాల కోర్టు కొత్త తేదీ

Posted: 02/17/2020 05:59 PM IST
Nirbhaya case all 4 convicts to be hanged on march 3 delhi court issues fresh warrants

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు శిక్ష ఎప్పుడు విధిస్తారని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. పాటియాల కోర్టు కొత్త తేదీని ఖరారు చేస్తూ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీలలో ఉరి శిక్ష విధించాలని న్యాయస్థానం జారీ చేసిన డెత్ వారెంట్లపై వరస పిటీషన్లు దాఖలు చేస్తూ.. వాయిదాలు తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువును కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో నిర్ణయ గడువు పూర్తైన నేపథ్యంలో ఢిల్లీ పటియాల న్యాయస్థానం కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించే విషయమై వారం రోజుల గడువునిస్తూ ఈలోగా.. దోషులు వారికి న్యాయపరంగా అర్హమైన అన్ని హక్కులను, అవకాశాలను వినియోగించుకోవాలని సూచించింది. వారం రోజుల వ్యవధి తరువాత అధికారులు శిక్షను అమలు పర్చే ప్రక్రియను ప్రారంభించవచ్చునని తెలిపింది. చివరి నిమిషంలో దోషులు తమ ఉరిశిక్షపై న్యాయస్థానాలను అశ్రయించి డెత్ వారెంట్ అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీళ్లపర్యంతమై న్యాయస్థానాన్ని కోరింది. ‘‘చేతులెత్తి మొక్కుతున్నా నా కూతురికి న్యాయం చేయండీ’’ అని న్యాయస్థానంలోనే అమె ప్రాధేయపడింది.  

అటు హైకోర్టు దోషులకు ఇచ్చిన గడువు ముగియడం, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. దోషులను ఉరితీసేందుకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరారు. అయితే ఇప్పుడు కూడా దోషులు అనేక యత్నాలు చేస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తిహార్ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్‌ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. ఇంకో దోషి అక్షయ్‌ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నట్లు వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే దోషులు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు హైకోర్టు ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసిందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్క దోషి పిటిషన్‌ కూడా ఏ న్యాయస్థానంలోనూ పెండింగ్ లో లేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దోషుల ఉరితీతకు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 3న దోషులను ఉరితీయాలంటూ తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles