Telanagana Minister convoy meets with accident రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ మంత్రి కాన్వాయ్

Minister puvvada ajay kumar convoy meets with accident in hyderabad

Puvvada Ajay Kumar, Telangana Transport Minister, CM KCR, KCR Birthday, Pragathi Bhavan, Hyderabad, Road Accident, GVK Mall, Banjara Hills, Hyderabad, Telangana, crime

Telangana Transport Minister Puvvada Ajay Kumar convoy has met with the road accident while he was on the way to the Chief Ministers resident. This incident has happened near GVK Mall in Banjara Hills

రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ మంత్రి కాన్వాయ్

Posted: 02/17/2020 04:32 PM IST
Minister puvvada ajay kumar convoy meets with accident in hyderabad

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. సీఎం కేసీఆర్‌ను కలిసి బర్త్ డే విషెస్ చెప్పడానికి బయల్దేరగా.. బంజారాహిల్స్ జీవీకే మాల్‌ వద్ద బైక్‌ను తప్పించబోయి కాన్వాయ్‌లోని వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. కాన్వాయ్‌లోని వాహనాలు తక్కువ వేగంతోనే వెళ్తుండటంతో.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం మంత్రి వేరే వాహనంలో ప్రగతి భవన్ వెళ్లారు.

పాతికేళ్ల క్రితం పువ్వాడ అజయ్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అజయ్, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. చాలా రోజులపాటు ఆయన అపస్మారక స్థితిలో ఉండిపోయారు. కళ్లపైనా ఎఫెక్ట్ పడింది. చాలా సర్జరీల తర్వాత ఆయన కోలుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఆయన కేటీఆర్‌కు సన్నిహితుడు. కేబినెట్ విస్తరణలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.  సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు తనయుడైన అజయ్.. 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles