Delhi Assembly Election 2020 voting underway ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: త్రిముఖ పోటీ.. నమోదవుతున్న ఓటరు తీర్పు

Assembly election 2020 delhi set to vote today after polarising campaign by bjp congress aap

Delhi Election, Delhi Assembly Election 2020, Delhi Assembly Election Polling 2020, Delhi Election Voting, Delhi Election2020 Polling, Delhi Election Polling Live, Delhi Election 2020, Delhi Polls, Delhi Polls 2020, Delhi Vidhan Sabha Elections, Delhi Legislative Assembly Elections, Delhi 2020 Voting, Delhi Election News, BJP, AAP, Congress, delhi assembly election, Delhi Vidhan sabha election, Delhi assembly elections 2020, Delhi Vidhan sabha election 2020, Delhi Vidhan sabha list, assembly election in Delhi, Delhi legislative assembly election, Delhi legislative assembly election 2020, Delhi assembly election result, Delhi election Vidhan sabha, Delhi Vidhan sabha result,

Delhi is set to vote to elect a new government, after a campaign in which the BJP pulled no punches against the AAP which is eyeing another term in office. The Congress is the third main force in the contest in which 672 candidates are in the fray for 70 assembly seats.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: త్రిముఖ పోటీ.. నమోదవుతున్న ఓటరు తీర్పు

Posted: 02/08/2020 09:50 AM IST
Assembly election 2020 delhi set to vote today after polarising campaign by bjp congress aap

దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికలలో మొత్తం 672 మంది అభ్యర్థులు బరితో నిలిచారు. మొత్తం 1.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81,05236 మంది పురుషులు కాగా, 66,80,277 మంది స్త్రీలు. మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం మొత్తం 13,750 పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచింది.

పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రదర్శనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎస్ దళాల్ని మోహరించారు. 40 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. 19 వేల హోంగార్డులు సైతం విధ్లుల్లో వున్నారు.

ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 67 సీట్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్‌, బీజేపి పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఓటర్లను ఆకర్షించడానికి ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజకీయాలతోపాటు పౌరసత్వ సవరణ చట్టం, నిరుద్యోగం వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నారు. ప్రచారంలో ప్రధానంగా ఆప్‌, బీజేపీ పోటీపడ్డాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపి క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈసారి కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే చాలా చోట్ల ఆప్ నకు లబ్ధి చేకూరేలా బలహీనమైన అభ్యర్థుల్ని నిలిపిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావృతం చేయాలని బీజేపి ఉవ్విళ్లూరుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తమ తీర్పును ఎవరి పక్షాన ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles