Pay Rs 5 crores or demolish temple: High Court ఐదు కోట్లు కడతారా.? ఆలయాన్ని కూల్చమంటారా.?

Telangana high court summons officials in unauthorised temple construction case

Telangana High Court, Unauthorised construction, Municipal Administration, Urban Development, Panchayat Raj, Rural Development, Hyderabad Metropolitan Development Authority, Ameenpur, Sangareddy, Telangana, politics

Taking a serious view of official failure to prevent unauthorised construction of a temple in a public park at Ameenpur, a division bench of Telangana High Court suggested to the temple committee concerned either to demolish the illegal construction or to pay Rs 5 crore.

ఐదు కోట్లు కడతారా.? ఆలయాన్ని కూల్చమంటారా.?

Posted: 02/08/2020 10:43 AM IST
Telangana high court summons officials in unauthorised temple construction case

ఐదు కోట్ల రూపాయలను కడతారా..? లేకపోతే ఆలయాన్ని కూల్చేయమంటారా.? ఈ తరహా బెదిరింపులు సహజంగా సినిమాల్లో విలన్లు చెబతుంటారు. కానీ ఏకంగా రాష్ట్రోన్నత      న్యాయస్థానం చెప్పిందంటే.. మ్యాటర్ కాస్తా సీరియస్ గానే వుంటుంది. అయితే ఇంతకీ కూల్చేస్తానని చెప్పింది ఏ అక్రమ నిర్మాణాన్నో అంటే.. అది ఒక ఆలయం. దేవాలయాన్నే కూల్చేస్తామని హైకోర్టు ఎందుకు చెప్పింది. అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌ మండల పరిధిలోని మాధవపురి హిల్స్ లోని రాక్ గార్డెన్ లో అనుమతుల్లేని ఆలయాన్ని కూల్చివేయాలని, లేదంటే అనుమతుల్లేకుండా నిర్మించినందుకు ఆలయ కమిటీ ప్రభుత్వానికి రూ.5 కోట్లు చెల్లించాలని హైకోర్టు అదేశించింది.

ఎలాంటి అనుమతులు పొందకుండా జరిగిన ఈ ఆలయ నిర్మాణంపై పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, జిల్లా పంచాయతీ అధికారి, అమీన్ పూర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈనెల 26న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాక్ గార్డెన్ లో 9,866 చదరపు గజాల పార్కు స్థలంలో అనుమతులు లేకుండా ఆలయాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ ఫౌరహక్కులు, వినియోగదారుల పరిరక్షణ సెల్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సుప్రీం కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని ధర్మాసనం పేర్కొంది. నిర్మాణం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

విచారణ సందర్బంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజోపయోగం నిమిత్తం వదిలిన ఖాళీ ప్రదేశాలను ఆక్రమణదారులు దేవుడి పేరుతో కబ్జా చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇది కచ్చితంగా చట్టవిరుద్ధమే. ధర్మం ప్రమాదంలో పడినప్పుడు దేవుడు అవతారాలు ఎత్తుతాడని అంటారు. ప్రస్తుతం చట్టం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. హిందువులలో 3 కోట్ల మంది దేవతలున్నారు. ప్రతి ఒక్కరూ ఈ దేవతల ఆలయాల కోసం ఇలా నిర్మాణాలు చేపడితే రేపు ఖాళీ స్థలమే మిగలదు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకులవుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇక కాలనీల్లో స్థలాలు ఎక్కడ మిగులుతాయని న్యాయస్థానం ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles