ap transport dept not issuing driving licences డ్రైవింగ్ లైసెన్సుల జారీ హుళ్లక్కు.. నిధులు నిల్.!

Ap transport dept not issuing driving licences due to lack of funds

CM YS Jagan, Chandrababu Naidu, Election Promises, Assembly Elections, applicants, driving licence, electronic chip, chip based driving licence, Transport department, pasupu kumkuma, Andhra Pradesh, Politics

Andhra Pradesh transport department is not issuing chip enabled driving licences for applicants, sources from the said department says it is due to lack of funds the department is not giving the applications for printing, says the funds were diverted to pasupu kumkuma scheme by previous government.

డ్రైవింగ్ లైసెన్సుల జారీ హుళ్లక్కు.. నిధులు నిల్.!

Posted: 02/07/2020 09:28 PM IST
Ap transport dept not issuing driving licences due to lack of funds

డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే నేరమని రవాణా చట్టాలు చెబుతున్నాయి. కానీ రవాణా శాఖా అధికారులే వాటిని జారీ చేయడంలో కాలయాపన చేస్తే తప్పు ఎవరిదీ. ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్రంలోని యువత అధికారులకు సంధిస్తుంది. లైసెన్సు లేదని పోలీసులు తమను ఆపితే తమ పరిస్థితి ఏమిటీ.? వారికి జరిమానాలు ఎవరు కట్టాలి. దరఖాస్తు చేసిన తరువాత అధికారులు తమ నుంచి రుసుము కట్టించుకున్న మంజూరు చేసిన లైసెన్సు రెండు నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటికీ ఇవ్వడం లేదని యువత ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరుగుతుందన్న విషయాన్ని తెలిసిన వర్గాల ద్వారా తెలుసుకుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వుందన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేందుకు అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని అసలు చిక్కంతా అసలు ముద్రణే కొ్త్త లెసెన్సులను పంపడం లేదని తెలుస్తోంది. అదేంటి డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ముద్రణ నిలిచిపోయిందా.? అంటే ఔనని చెప్పక తప్పదు. గత కొన్ని నెలలుగా ముద్రణ జరగడం లేదని తెలుస్తోంది. చిప్ ఆధారిత సింథటిక్ కార్డులు జారీ చేయలేనప్పుడు.. డ్రైవింగ్ టెస్ట్ లు ఎందుకు నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

రవాణాశాఖ అధికారుల సమాధానాలతో అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు నిధులు ఏమయ్యాయని నిలదీస్తే అసలు విషయం బయటపడింది. తమ శాఖకు సంబంధించిన డబ్బులను పసుపు కుంకుమ కోసం కేటాయించడంతో ప్రస్తుతం తమ శాఖ నిధుల లేమితో బాధపడుతోందని.. ఈ నేపథ్యంలోనే తాము లైసెన్సు కార్డులను ముద్రించ లేకపోతున్నామని రవాణా శాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడు నెలలు గడుస్తుంది. మరి కొత్త ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లారా.? కొత్త ప్రభుత్వం ఏం సమాధానం ఇచ్చింది. అంటే సమాధానాలను దాటవేస్తున్నారు.

అసలు రాష్ట్రంలోనే నిధులు లేక రాజధానిని విశాఖ నగరానికి తరలిస్తున్నారని రవాణశాఖ అధికారులే సమాధానాలు ఇస్తున్నారు. అయితే డ్రెవింగ్ టెస్టులు పెట్టి తమ వద్ద నుంచి డబ్బును ఎందుకు వసూళ్లు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. శాఖపరంగా ఈ వివరాలను మేము చెప్పలేమని ధాటవేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే... వారి కార్డుకు సంబంధించిన డబ్బులను కూడా రవాణా శాఖ దరఖాస్తుదారు వద్ద నుంచే వసూలు చేస్తుంది. అయినా వారికి కార్డులు రాకపోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2019 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హయాంలో పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించింది. వాటిని మూడు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చింది. 2019 ఫిబ్రవరి, 2019 మార్చిలో రెండు విడుతలుగా నిధులను విడుదల చేశారు. ఆ తర్వాత మూడో విడుత నిధులను ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే, పసుపు కుంకుమ కింద ఇవ్వాల్సిన నిధులను వివిధ శాఖల నుంచి మళ్లించారు. అందులో రవాణా శాఖకు చెందిన నిధులు కూడా ఉన్నాయని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles