మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లు, రాజధాని అమరావతి అభివృద్ది మండలి ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ దూకుడు పెంచారు. ఈ రెండు బిల్లులను ఇటీవల మండలిలో సెలక్ట్ కమిటీలకు పంపుతూ తీర్మాణం చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోని పార్టీలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ఇవ్వాలని కూడా లేఖను రాశారు. ఇక తాజాగా ఇవాళ ఈ రెండు బిల్లులకు రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ అదేశాలను జారీ చేశారు.
మూడు రాజధానుల పాలనా వికేంద్రీకరణ బిల్లుకు సెలక్ట్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ తరపున నారా లోకేష్, పీ.అశోక్‌బాబు, తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి.. పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్.. వైఎస్సార్సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ఇక సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర యాదవ్, గౌనివారి శ్రీనివాసులు ఉన్నారు. వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజులు సభ్యులుగా ఉన్నారు.
కమిటీల ఏర్పాటు సంగతి అలా ఉంటే.. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి పేర్కోన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మంత్రులు, వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తాము ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండబోమని మండలి ఛైర్మన్ కు లేఖ రాసింది. నోటి మాట ద్వారా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదని.. కమిటీ ఏర్పాటుకు కొన్ని విధానాలు ఉంటాయంటున్నారు మంత్రులు. మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే ప్రక్రియ పూర్తి కాలేదని.. అలాంటప్పుడు విచక్షణాధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 08 | టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు 'సహనం కొల్పోయారు. ఆశించిన స్థాయిలో పార్టీ కార్యకర్తలు రాకపోవడంతోనో.. లేక మరే కారణమో తెలియదు కానీ ఆయన ఇవాళ విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఓ మహిళ... Read more
Mar 08 | టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వివాదాస్పదం అవుతున్నాయి, గుంటూరు యువతను రెచ్చగొట్టేలా ఆయన వ్యాక్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు కూడా పిర్యాదులు వెళ్లాయి. రాష్ట్రానికి... Read more
Mar 08 | కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మంత్రిపై పిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త తన పిర్యదును ఉపసంహరించుకున్నారు. తన ఫిర్యాదుతో బాధితురాలి పరువు,... Read more
Mar 08 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ అర్థర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని... Read more
Mar 08 | ఇక్వెటోరియల్ గినియా దేశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. మిలిటరీ క్యాంప్ లో ప్రమాదం చోటుచేసుకుని సంభవించిన పేలుళ్లలో 20 మంది వరకు మృత్యువాతపడగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. దేశ ఆర్థిక రాజధాని బాటాలోని కోమా... Read more