కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదాయపన్ను శాఖను పూర్తిగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఐటీ అధికారులు టీడీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఆ తరువాత కాస్త సన్నగిల్లిన విమర్శలు.. మళ్లీ ఊపందుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడం.. అందులోనూ టీడీపీ నేతలనే టార్గెట్ చేయడంతో విమర్శలు తెరపైకి వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా కేవలం సినీపరిశ్రమ వర్గానికి చెందిన ప్రముఖుల వరకే పరిమితమైన ఐటీ దాడులు క్రితం రోజు నుంచి టీడీపీ నేతలను టార్గెట్ గా సాగుతున్నాయి. కాగా రాష్ట్రంలోని రాజకీయ నేతలపై ఐటీ అధికారుల మళ్లీ దృష్టిసారించారు. క్రితం రోజున కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి నివాసంలో సోదాలు ప్రారంభించిన ఐటీ అధికారులు ఇవాళ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ప్రారంభించిన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇక అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత పిఏగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసులు ఇంటిపైకూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ఇవాళ్ల కూడా టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావును టార్గెట్ చేసిన ఐటీ అధికారులు.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆయనకు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అంతేకాదు మాదాపూర్‌లోని డీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు డీజీజీఐ తెలిపింది. ఆ కంపెనీ యాజమాని నరేన్ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డికి చెందిన హైదరాబాద్‌లోని కార్యాలయంలో ఐటీ సోదాల్లో కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more