Shaheen Bagh Training Squads Of Suicide Bombers మరోమారు కాంట్రావర్సీకి కాలుదువ్విన కేంద్రమంత్రి

Suicide bombers are being created at shaheen bagh giriraj singh

BJP, Giriraj Singh, Shaheen Bagh, Training Squads Of Suicide Bombers, Twitter, CAA, PM Modi, Lok Sabha, Parliament, Urban Naxals, National Politics

Union Minister Giriraj Singh said that the protest in Shaheen Bagh against the Citizenship (Amendment) Act has become a breeding ground for suicide bombers. Giriraj, who has notorious for making controversial remarks, remained defiant of his statement

మరోమారు కాంట్రావర్సీకి కాలుదువ్విన కేంద్రమంత్రి

Posted: 02/06/2020 06:10 PM IST
Suicide bombers are being created at shaheen bagh giriraj singh

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 40 రోజులుగా కొనసాగుతున్న ధర్నాపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం పట్ల ధన్యావాదాలు తెలుపే చర్చాలో పాల్టొంటూ ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఏఏ నిరసనలకు మద్దతునిస్తూ యూపీఏ భాగస్వామ్య పక్షాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ గా వుండే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

షాహీన్ బాగ్‌ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇదివరకు సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఆందోళనకారులను అర్బన్ నక్సల్ అంటూ విమర్శించిన బీజేపికి ఆయన తాజాగా మరో పదాన్ని అందించారు. ‘ఈ షాహీన్‌బాగ్‌ ఇప్పుడు ఉద్యమం కాదు. ఆత్మాహుతి బాంబర్లను పెంచుతున్న కేంద్రం. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు’ అని గిరిరాజ్‌ ట్వీట్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా గతేడాది డిసెంబరు 18 నుంచి వందలాది మంది పురుషులు, మహిళలు, చిన్నారులు షాహీన్‌బాగ్‌లో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

గత 40 రోజులుగా ఈ ధర్నా.. డిల్లీ ఎన్నికల్లో కీలక ప్రచారాస్త్రంగా మారింది. ఆప్‌, కాంగ్రెస్‌ల మద్దతుతోనే  ఆందోళనకారులు రహదారిని అడ్డగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని... తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శిబిరాన్ని లేపేస్తామని భాజపా నేతలు ఉద్వేగభరిత ప్రసంగాలు చేస్తున్నారు. అయితే, బీజేపి ఆరోపణలను ఆప్‌ అదే స్థాయిలో తిప్పికొట్టింది. అధికారం కోసం ఆ పార్టీ మురికి రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు. మరోవైపు ఈ శిబిరానికి కాంగ్రెస్‌ పరోక్షంగా మద్దతిస్తూ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles