దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనన్ మాల్యా తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్ కోసం పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.170 కోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు. రైల్వే బడ్జెడ్‌పై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్యరైల్వే జీఎం గజనన్ మీడియా సమావేశం నిర్వహించారు. గత బడ్జెట్లో రూ.1,56,352 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.1,61,042 కోట్లు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. గత బడ్జెట్‌తో పోల్చితే 3శాతం అదనపు నిధులు కేంద్రం కేటాయించిందని చెప్పారు.
ఈ బడ్జెట్లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2020-21 ఏడాదిలో మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ.6,846 కోట్లు కేటాయించారు. డబ్లింగ్, మూడో లైన్, బైపాస్ లైన్ పనుల కోసం రూ.3,836 కోట్లు, కొత్త లైన్లు ఇతరత్రా వ్యయాల కోసం రూ. 2,856 కోట్లు, ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. ఇఖ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌కు రూ.5 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్ట్‌కు రూ.235 కోట్లు, మునిరాబాద్-మహబూబ్‌నగర్ కొత్త లైన్ ప్రాజెక్ట్‌కు రూ.240 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్తలైన్ ప్రాజెక్ట్‌కు రూ.520 కోట్లు, కాజీపేట-బల్లార్ష 3వ లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.483 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి కొత్త ప్రాజెక్ట్‌కు రూ.1198 కోట్లు, విశాఖ రైల్వే జోన్‌కు రూ.170 కోట్లు కేటాయింపులు జరిగాయి.
11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు:
సికింద్రాబాద్-గౌహతి
లింగంపల్లి-తిరుపతి
లింగంపల్లి-గుంటూరు
చర్లపల్లి-వారణాసి
చర్లపల్లి-పన్వేల్
చర్లపల్లి-శాలిమార్
చర్లపల్లి-చెన్నై
చర్లపల్లి-శ్రీకాకుళం
విజయవాడ-విశాఖపట్నం
ఔరంగబాద్-పన్వేల్
(And get your daily news straight to your inbox)
Feb 24 | పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు... Read more
Feb 24 | పుదుచ్చేరిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై... Read more
Feb 24 | కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం... Read more
Feb 24 | మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు... Read more
Feb 24 | కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన... Read more