Guj lioness & cubs making way for biker win hearts కూనలతో వెళ్తున్న మృగరాణికి ఎదురోచ్చిన బైకర్..

Guj lioness cubs making way for biker win hearts

lion, lioness with cubs, lion cubs, parimal nathwani, gir, gir national park, Biker, lioness, cubs, Gir sanctuary, Rajya Sabha MP, Parimal Nathwani, Gujarat, social media, viral video, crime

A video of a lioness and her cubs making way for a biker in the outskirts of the Gir sanctuary in Gujarat is doing the rounds on social media. The clip was shared by Rajya Sabha MP Parimal Nathwani

ITEMVIDEOS: సింహానికి ఎదురోచ్చిన బైకర్.. ఏం జరిగిందంటే.!

Posted: 02/05/2020 04:39 PM IST
Guj lioness cubs making way for biker win hearts

సింహాన్ని సినిమాల్లో చూసి బాగుందని భావిస్తే.. జూలోనో లేక సర్కాస్ లలో దగ్గరగా వెళ్లి చూస్తే చాలు దడుచుకుంటా. అలాంటిది ఇక దాని గాండ్రింపులు వింటే హడలిపోతాం. ఇక అవే అటవీమార్గంలో మనుషులకు ఎదురుగా వస్తే.. ఇంకేముంది ఫ్యాంటు తడచిపోవడం గ్యారంటీ. కానీ ఇక్కడ మాత్రం అడవిలో బైకుపై వెళ్తున్న ఇద్దరికి ఎదురుగా మృగరాజు కనిపించాడు. ఒక్కటి కాదు ఏకంగా మూడు సింహాలు అదే దారిలో బైక్ కు ఎదురుగా వచ్చాయి. ఇలాంటి ఘటన ఎదురైతే.. ఆ బైక్ పై మీరుంటే ఎలా వుంటుంది.?

ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే గుండె అదిరిపోతోంది కదా. నిజమే గుజరాత్ లోని గిర్‌ నేషనల్‌ పార్కులో ఇద్దరు వ్యక్తులకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. గుజరాత్ లోని గిర్ జాతీయ పార్కులోని ఓ మట్టి రోడ్డు గుండా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా, హఠాత్తుగా ఓ తల్లి సింహంతో పాటు రెండు సింహ కూనలు అదే దారిలో వారికి బైక్ ముందుకు చేరుకున్నాయి. వెంటనే బైక్ బ్రేక్ వేసినా.. వారికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు.

ఇప్పుడేం జరుగుతుందో ఎవరైనా ఊహించవచ్చు. వాటిని రుచికరమైన ఆహారం లభించేసిందిరోయ్ అని అనుకుంటున్నారు కదూ.. కానీ అక్కడే వుంది అసలు ట్విస్టు. అబ్బా మనుషులు వాహనంపై వస్తున్నారురోయ్.. అని అనుకున్నాయో ఏమో కానీ అవి కాస్తా అలోచించి.. మట్టి రోడ్డు పై నుంచి పక్కకు తప్పుకుని వెళ్లింది. అడవి మార్గంలోకి కూనలతో కలసి వెళ్లింది. అంతే బైక్ వెళ్లేందుకు ఎంచక్కా దారిని వదిలేసింది. దీంతో వారిద్దరూ బతుకుజీవుడా అని బయటపడ్డారు.

సాధారణంగా సింహం మృగరాజైనా.. దానిని క్రూర జంతువు అనే అంటాం.. అయితే గిర్ జాతీయ పార్కులోని అనేక సింహాలు చాలా శాంత స్వభావులని.. అవి మనుషులను ఏమాత్రం హాని చేయవని నెట్టింట్లో చాలా మంది నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ట్విటర్లో పోస్టు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ఇదే సందర్భంలో వాయనాడ్ లోని ఓ పెద్దపులి బైక్ పై వెళ్తున్న ఓ బైకర్ ను వెంటాడిన వీడియో కూడా తాజాగా పలువురు పోస్టు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Biker  lioness  cubs  Gir sanctuary  Rajya Sabha MP  Parimal Nathwani  Gujarat  social media  viral video  crime  

Other Articles