Family of Shaheen Bagh shooter deny links with AAP ‘‘నా కొడుకు బీజేపి మద్దతుదారుడు’’: కపిల్ గుజ్జర్ తండ్రి..

Family members of shaheen bagh shooter kapil gujjar deny links with aap

kapil Gujjar, Shaheen Bagh, shooter, links, aap, delhi police, father gaje singh, lok sabha, aam admi party, delhi elections, jamia firing, jamia millia university, caa, delhi, delhi police, shaheen bagh, gunman, firing at jamia, jamia university firing, jamia millia islamia, Jamia Firing, jamia millia University, Firing, Gate no 5, CAA protest, Anti CAA protest, Politics

Family of Shaheen Bagh shooter Kapil Gujjar has denied links of any of its members with AAP. "AAP has nothing to do with anyone from my family. They came to us during Lok Sabha elections. They made us wear AAP caps. I was in BSP in 2012. Later, I quit politics," Gaje Singh, Kapil's father told

‘‘నా కొడుకు బీజేపి మద్దతుదారుడు’’: కపిల్ గుజ్జర్ తండ్రి..

Posted: 02/06/2020 10:38 AM IST
Family members of shaheen bagh shooter kapil gujjar deny links with aap

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా విశ్వవిద్యాలయం ఆవరణలోని విద్యార్థులు గత కొన్ని రోజులుగా అందోళనలు చేపట్టడుతుండగా.. వారిని సమీపించి గాల్లోకి కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ చుట్టూ రాజకీయ వివాదం అలుముకుంటోంది. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్న తరుణంలో అతను అమ్ అద్మీ పార్టీ కార్యకర్త అంటూ చెప్పడంతో సీఏఏను వినియోగించుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అప్ పార్టీ లబ్దిపోందడానికి పరోక్షంగా బీజేపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వచ్చాయి.

కపిల్ గుజ్జార్ ఆప్ సభ్యుడని అంగీకరించినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఫొటోలు కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ ఫొటోలన్నీ గుజ్జర్ ఫోన్ లో ఉన్నాయని, అందులో అతడు ఆప్ టోపీ ధరించి ఉన్నాడని, పక్కనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన అప్ పార్టీ.. ఎలాంటి దర్యాప్తు, విచారణ లేకుండా ఓ నిందితుడ్ని తమ పార్టీ సభ్యుడని ఎలా నిర్థారిస్తారంటూ ప్రశ్నించింది. కట్టుకధలను అల్లి.. తమ పార్టీపై బురదజల్లి.. నష్టం కలిగేలా వివరాలను వెల్లడించిన డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.

తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. కపిల్ గుజ్జర్ తండ్రి రంగంలోకి దిగి.. తన కుమారుడు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా మద్దతుదారుడని వెల్లడించారు. తనకు తన కుమారుడికి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అయితే తమకు ఢిల్లీ అధికార పార్టీ ఆఫ్ తో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ‘నేను కానీ లేదా నా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఆప్ తో సంబంధం లేదు. గత ఏడాదిలో లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ అందరితో పాటు కపిల్ కూడా టోపీ ధరించాడు అంతే’ అంటూ గాజే సింగ్ వివరణ ఇచ్చారు.

ఆ తరువాత మరికొన్ని గంటల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ‘నా కుమారుడు మోడీ సపోర్టర్. మోడీ, అమిత్ షా అనుచరుడు కూడా’అని అన్నాడు. తన కుమారుడికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. షాహీన్ బగ్ మీదుగా రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో కపిల్ ఇబ్బంది పడ్డాడని, గంటలో వెళ్లాల్సిన పనికి నాలుగు గంటలు ఆలస్యమైందని అన్నాడు. అంతేకాదు.. తన కుమారుడు జాతీయభావాలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ హిందుస్థాన్, హిందుత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటాడని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles