Telangana: Helmet mandatory on pillion riders టూవీలర్ పై వెళ్తున్నారా.? ఇకపై ఇది తప్పనిసరి.!

Telangana traffic police brings new mvi rules into force silently

new MVI Act, Two Wheelers, Helmet, Pillion drivers, pillion riders, Hyderabad, Cyberabad, Rachakonda, social media, Telangana, crime

Helmet for pillion riders will soon become mandatory in the State as the transport department is planning to make tougher traffic rules to prevent road accidents. An awareness rally was also taken out on the use of helmet by pillion riders marking the week-long 31st national road safety week celebrations.

టూవీలర్ పై వెళ్తున్నారా.? ఇకపై ఇది తప్పనిసరి.!

Posted: 02/03/2020 06:34 PM IST
Telangana traffic police brings new mvi rules into force silently

తెలంగాణ ప్రభుత్వం చాపకింద నీరులా కొత్త వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. అయితే వాహనదారులకు వేల రూపాయల జరిమానాలు విధించే విషయాన్ని పక్కనబడితే.. తెలంగాణలో ప్రమాద రహిత ప్రయాణాలకు చర్యలు తీసుకునే విషయంలో భాగంగా ద్విచక్రవాహనాలపై మరో నిబంధనను కూడా అమల్లోకి తీసుకువచ్చారు. టూవీలర్ పై వెళ్తే.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఈ మేరకు నిబంధనను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. దీనిని పాటించని వారికి చాలానాలను విధించి పంపుతున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన కొత్త వాహన చట్టంలోని టూవీలర్స్ కు సంబంధించిన చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఇకపై పిల్లాన్ రైడర్స్ కు హెల్మెట్ తప్పనిసరి.. అంటే టూవీలర్ వాహనాల వెనుక కూర్చునేవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనల అమల్లోకి వచ్చింది. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించి.. హెల్మెట్ లేకుండా వాహనంపై వుంటే ఇక వారికి రూ.100 మేర అపరాద రుసుం కింద చాలానా పడుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇక వాహనదారులు ఈ నిబంధనపై మండిపడుతున్నారు. రోడ్డుపై వయోవృద్దులు, పిల్లలు, విద్యార్థులు, వికలాంగులు వెళ్తుంటారని.. వారు నగరంతో పాటు పలు ప్రాంతాలకు చేరుకునేందుకు టూవీలర్స్ ను లిప్ట్ అడుగుతుంటారాని.. అయితే ఈకొత్త నిబంధనతో వారికి కనీసం సాయంచేసే అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. పాఠశాలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా లిప్ట్ అడుగుతుంటారని, వారికి తాము సాయపడకుండా ట్రాఫిక్ పోలీసుల చర్యలు వున్నాయని అంటున్నారు. ఇక దీనితో పాటు ఆసుపత్రుల వద్ద కూడా వయోవృద్దలు లిప్ట్ అడిగే సందర్భాలు అనేకవుంటాయని వాహనదారులు అంటున్నారు.  

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఈ రూల్ అమలవుతోంది. హెల్మెట్లు పెట్టుకోకపోతే... కేసులు రాసి ఫైన్లు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చలానాలు ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ఫైన్ చెల్లించాల్సింది బైక్ నడిపే వ్యక్తే. అంటే.. వెనక కూర్చున్న వ్యక్తి బాధ్యత కూడా బైక్ నడిపే వ్యక్తిదే అన్నమాట. రాచకొండ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 263 కేసులు రాశారు. రూ.28,400 జరిమానాలు వేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల ప్రజలంతా... రెండు హెల్మెట్లు కొనుక్కోవడం బెటర్. లేదంటే జేబుకి చిల్లు పడటం ఖాయం. అయితే.. ఈ నిబంధనపై కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదని జరిమానా విధించడం కరెక్ట్ కాదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles