అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ అరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు సీఐడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిఐడీ తన దూకుడు పెంచింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్ కార్డుదారులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 700మందికిపైగా తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు ఫైల్ చేశారు. రూ.3కోట్ల చొప్పున భూముల్ని కొనుగోలు చేసినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం స్పెషల్ టీమ్ లను రంగంలోకి దించింది.
భూములు కొనుగోలు చేసిన రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టిన సీఐడీ.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులు సంగతి అలా ఉంటే అమరావతిలో రాజధాని భూముల కొనుగోలులో మనీలాండరింగ్ జరిగినట్లు సీఐడీ అనుమానిస్తోందట. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారట. అందుకే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఈడీకి సీఐడీ లేఖ రాసిందట. తాజాగా తెల్ల రేషన్ కార్డుదారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తామని సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ చెబుతున్నారు.
అమరావతిలో మొత్తం 796 రేషన్‌కార్డుదారులు.. రూ.300కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. అలాగే మాజీ మంత్రులు నారాయణ, పుల్లారావులపై కేసులు నమోదయ్యాయి. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళ.. తనను మభ్యపెట్టి తనకు సంబంధించిన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేశారు. మంత్రులతో పాటూ స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదయ్యాయి.
గత నెలలో జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని అమరావతి భూములు కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. కొంతమంది టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు, నేతలు తమ డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే సిబ్బంది పేర్లపై భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం త్వరలోనే బయటకు వస్తుందన్నారు.. సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ఇప్పుడు సీఐడీ కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more