YS Jagan Govt Gives One More Major Shock! వాహనదారులకు జగన్ సర్కార్ పెద్ద జలక్.. ఇంధనంపై వ్యాట్ పెంపు

Ys jagan govt one more major shock hikes vat percentage on fuel

CM Jagan, VAT (Value Added Tax), Fuel Charges, petrol, diesel, vat on petrol, vat on diessel, petrol price, diesel price, Andhra Pradesh, India

CM Jagan has hiked the VAT (Value Added Tax) on petrol and diesel by 4.5 percent. he has increased petrol, diesel prices along with the hike of state government-imposed VAT

వాహనదారులకు జగన్ సర్కార్ జలక్.. ఇంధనంపై వ్యాట్ పెంపు

Posted: 01/30/2020 04:09 PM IST
Ys jagan govt one more major shock hikes vat percentage on fuel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు లేమి వెంటాడుతున్నదన్న విషయం తెలిసిందే. అయినా ఎన్నికలలో గెలుపు కోసం.. ప్రజలను అకర్షించడం కోసం అన్ని పార్టీలో తమ శక్తిమేరకు వారికి ఉచిత తాయిలాలను ప్రకటించాయి. ఎన్నికలు ముగిసాయి.. అధికంగా ఉచిత హామీలను ప్రకటించిన పార్టీలు అధికార పీఠాన్నెక్కాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. కానీ ఐదేళ్ల పాటు వాటిని కొనసాగించడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది ప్రభుత్వానికి. దీంతో ప్రభుత్వం వడ్డింపులకు పనిచెబుతోంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టాలను భర్తీ చేసుకునేందుకంటూ.. ఆర్టీసీ చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ఆ తరువాత మధ్యం రేట్లను కూడా భారీగా పెంచేసింది. ఇక తాజాగా ఆంద్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం.. వాహనదారులకు కూడా షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే పోరుగు రాష్ట్రాలకన్నా అధికంగా వున్న ఇంధన ధరలను మరింత పైకి తీసుకెళ్లే విధంగా తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు షాక్ గురవుతున్నారు. అసలే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ రెండో పర్యాయం వచ్చిన తరువాత అంత్జాతీయంగా ఇంధన ధరలకు ఆకాశాన్ని చూస్తున్నాయి.

దీనికి తోడు వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. పెట్రోల్‌పై ఇప్పటి వరకూ 31 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా.. దాన్ని 35.20 శాతానికి పెంచారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ వసూలు చేస్తుండగా దాన్ని 27 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం కారణంగా పెట్రోల్, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.2 చొప్పున పెరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వాస్తవానికి పొరుగున ఉన్న కర్ణాటకతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోనే పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ బాదుడు ఎక్కువగా ఉంది.

పొరుగు రాష్ట్రంతో పోలిస్తే మన దగ్గర పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో 2018 సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్‌పై రూ.2 పన్ను తగ్గిస్తూ నాటి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. కాగా, తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక డీజిల్ పై కూడా వ్యాట్ పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలపై కూడా వాటి ప్రభావం పడుతుందని.. ఫలితంగా కొందరికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అందరి నుంచి డబ్బును వసూళ్లు చేయడం ఏంటన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles