Man opens fire at anti-CAA protesters near Jamia University సీఏఏ నిరసనకారులపై అగంతకుడి కాల్పులు..

Main dunga azadi man opens fire at anti caa protesters near jamia millia university

Jamia firing, Jamia millia islamia, Jamia firing, delhi Jamia firing, jamia protest, jamia firing injured, delhi police, jamia gun firing

A student has reportedly been injured after an unidentified person opened fire at protesters, who were agitating against the Citizenship Amendment Act (CAA), near the Jamia Millia Islamia University in Delhi. The culprit has been detained by the police.

ITEMVIDEOS: సీఏఏ నిరసనకారులపై అగంతకుడి కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత

Posted: 01/30/2020 05:03 PM IST
Main dunga azadi man opens fire at anti caa protesters near jamia millia university

ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్శిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ‘‘ఆజాదీ కావాలా అయితే రండీ నేను కాల్చేస్తాను మీకు అజాదీ వస్తుందం‘‘టూ పెద్దగా అరుస్తూ ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. యూనివర్శిటీలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఈ ఘటనలో యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి గాయపడ్డాడు. విద్యార్థి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో రక్తపు గాయమైంది.

క్షతగాత్రుడ్ని జామియా నగర్లోని హోలీ ఫ్యామిటీ అసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో, యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుపు రంగు ప్యాంటు, నల్లటి రంగు జాకెట్ ధరించిన ఆ వ్యక్తి... భారీగా పోలీసులు ఉన్న రోడ్డుపై నుంచే నింపాదిగా నడుచుకుంటూ వచ్చి కాల్పులు జరిపినట్టు ఓ వీడియోలో రికార్డ్ అయింది. కాల్పులు జరుపుతున్న సందర్భంగా... 'మీ స్వాతంత్ర్యం ఇదిగో' అంటూ అతను గట్టిగా అరిచాడు. అరుస్తూనే వెనక్కు నడుస్తూ పోలీసుల వద్దకు సమీపించాడు.

అలర్ట్ అయిన పోలీసులు... ఆగంతుకుడిని అదుపులోకి తీసుకుని పోలిస్ స్టేషన్ కు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి క్యాంపస్ లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థుల మధ్యలోకి వచ్చి కాల్పులు జరపడం శాంతియుతంగా వున్న విద్యార్థులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆమ్నా ఆసిఫ్ అనే విద్యార్థిని మాట్లాడుతూ, బ్యారికేడ్లకు సమీపంలో తాము ప్రశాంతంగా ర్యాలీని నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడకు వచ్చిన ఆగంతుకుడిని తాము గుర్తించలేదని చెప్పింది. రివాల్వర్ ను చేతిలో పట్టుకుని అతను తమ వైపుగా ముందుకు కదిలాడని తెలిపింది. అతన్ని ఆపేందుకు తాము యత్నించామని చెప్పింది.

పోలీసులు అక్కడే ఉన్నారని, అతన్ని ఆపాల్సిందిగా పోలీసులను కోరామని... కానీ, పోలీసులు స్పందించలేదని వెల్లడించింది. దీంతో ఆగంతుకుడి నుంచి రివాల్వర్ ను లాక్కునేందుకు తాము ప్రయత్నించగా... తమ స్నేహితుల్లో ఒకరిపై అతను కాల్పులు జరిపాడని చెప్పింది. అతను విద్యార్థుల్లో ఒకడు కాదని, కచ్చితంగా బయట నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపింది. ఈ ఘటన అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles