mla balakrishna faces protest in hindupur సొంత నియోజకవర్గం బాలయ్యకు చేధు అనుభవం

Balakrishna faces protest in his own hindupur constituency

Balakrishna, TDP, HIndupuram MLA, YSRCP activists, hindupur, ananthapuram, Rahamatapuram circle, protest against Three Capitals, Andhra Pradesh Politics

In a major setback, Hindupur MLA BalaKrishna faces setback in his own assembly constituency as YSRCP activists protest against his visit demanding his decision on Three capitals and establishment of High court in Kurnool.

సొంత నియోజకవర్గం బాలయ్యకు చేధు అనుభవం

Posted: 01/30/2020 03:10 PM IST
Balakrishna faces protest in his own hindupur constituency

సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలోనే ఆయనకు ఈ పరాభవం ఎదురైంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనకు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు బాలయ్యకు నల్లజెండాలు, గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అక్కడి కొంత సేపు టీడీపీ.. వైసీపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.

హిందూపురం పట్టణంలోని రహమతపురం సర్కిల్‌ వద్దకు బాలకృష్ణ కాన్వాయ్‌ రావడంతో.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుతున్నారని బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటున్న బాలయ్య.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాలకృష్ణ గోబ్యాక్‌ అంటూ నినదించారు. మరోవైపు బాలకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయినా వారు నిరసనలను వీడకపోవడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో హిందూపురంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి సద్దుమణిగడంతో.. ఎమ్మెల్యే బాలకృష్ణ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. కాగా, మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రదర్శనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న టీడీపీ.. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  TDP  HIndupuram MLA  YSRCP activists  Three Capitals  Andhra Pradesh Politics  

Other Articles