Ind vs NZ: Iyer's quickfire 58 helps India beat Kiwis by 6 wickets తొలి టీ20లో భారత్ ఘనవిజయం

Ind vs nz teamindia make good against new zealand at auckand in 1st t20 by 6 wickets

Ind vs NZ 1st T20, Eden Park, Virat Kohli, India toss, KL Rahul, Shreyas Iyer, Tim southee, Martin Guptill, Ross Taylor, Auckland T20, first Twenty20, sports news, cricket, sports, cricket, sports

India have made a winning start to their Twenty20 international series against the Black Caps, pulling off an emphatic chase at Eden Park of Auckland on Friday night. KL Rahul and Shreyas Iyer produced the most explosive half centuries of their Twenty20 international careers to chase the score.

టీమిండియా శుభారాంభం: దంచికొట్టిన రాహుల్ అయ్యార్ ద్వయం

Posted: 01/24/2020 04:38 PM IST
Ind vs nz teamindia make good against new zealand at auckand in 1st t20 by 6 wickets

న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా శుభారంభం చేసింది. సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో వచ్చి రావడంతోనే అతిథ్యజట్టుతో తలపడిన విరాట్ సేన తొలి టీ20లో ఆరువికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కివీస్ విసిరిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే అవలీలగా ఛేదించేసింది. ఆరంభంలోనే హిట్టర్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీకి తోడుగా ఓపెనర్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్ అద్భుత ప్రదర్శన విజయతీరాలకు చేర్చింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ (56: 27 బంతుల్లో 4x4, 3x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45: 32 బంతుల్లో 3x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ విజయానికి బాటలు వేయగా.. ఆఖర్లో శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్: 29 బంతుల్లో 5x4, 3x6) హిట్టింగ్‌తో న్యూజిలాండ్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో.. 19 ఓవర్లలోనే 204/4తో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్‌ ఆక్లాండ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకి ప్రారంభంకానుంది.

అంతకముందు టీమిండియా బౌలర్లని ఉతికారేసిన కివీస్ ఊహించని రీతిలో 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టులో ఓపెనర్ కొలిన్ మున్రో (59: 42 బంతుల్లో 6x4, 2x6), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51: 26 బంతుల్లో 4x4, 4x6), రాస్ టేలర్ (54 నాటౌట్: 27 బంతుల్లో 3x4, 3x6) అర్ధ శతకాలు సాధించగా.. మార్టిన్ గప్తిల్ (30: 19 బంతుల్లో 4x4, 1x6) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 203 పరుగులు చేయగలిగింది.

భారత బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. ఎంతలా అంటే..? జస్‌ప్రీత్ బుమ్రా మినహా అందరి ఎకానమీ 7.75కి పైనే ఉండటం విశేషం. 4 ఓవర్లు వేసిన బుమ్రా ఒక వికెట్ తీసి 31 పరుగులివ్వగా.. శార్ధూల్ ఠాకూర్ 3 ఓవర్లలో 44 పరుగులు, మహ్మద్ షమీ 4 ఓవర్లలో 53, చాహల్ 4 ఓవర్లలో 32, శివమ్ దూబే 3 ఓవర్లలో 24, జడేజా 2 ఓవర్లలో 18 పరుగులిచ్చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండగా.. భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ముప్పావు వంతు సిక్సర్లు వచ్చాయి. అతని బౌలింగ్‌ని లక్ష్యం చేసుకుని మున్రో, విలియమ్సన్ భారీ సిక్సర్లు బాదేశారు.

భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని మార్పులు చేశాడు. కోహ్లీ చేసిన మార్పులు అంచనాలకు తగ్గట్టుగా సాగాయి. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటు వేసి ఓపెనర్ కేఎల్ రాహుల్‌కి కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. దీంతో.. ఐదో స్థానంలో మనీశ్ పాండే రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌పైనా వేటు పడగా.. చాహల్‌కి ఛాన్స్ దక్కింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కీపర్‌గా రాహుల్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles