Happy wishes on National Girl Child Day 2020 ఆడపిల్లను పుట్టనిద్దాం.. బాలికలకు భరోసానిద్దాం..

National girl child day 2020 education equality and empowerment

national girl child day, today special day, national girl child day theme, national girl child day 2020, national girl child day india, me too, patriarchy, girl child issues, government of India, Ministry of Women and Child Development, National Girl child Day, National Girl Child Day 2020

Started by the Ministry of Women and Child Development and the Government of India in 2008, the National Girl Child Day is celebrated on January 24. The purpose of the day is to spread awareness among the people about the inequalities girls face in India.

ITEMVIDEOS: ఆడపిల్లను పుట్టనిద్దాం.. బాలికలకు భరోసానిద్దాం..

Posted: 01/24/2020 05:45 PM IST
National girl child day 2020 education equality and empowerment

సమాజంలో మార్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్న మనిషి.. ఎవరు తమకు ఆశలు అధికంగా కల్పిస్తే వారి ప్రలోభంలో పడి వారినే పాలకుడిగా ఎన్నుకుంటున్నాడు. అయితే ఆ ఆశలు అడియాశలు అవుతున్నాయే కానీ.. ఆశించిన మార్పులు మాత్రం సాద్యం కావడం లేదు. నీరు, కూడు, గుడ్డ అనే వాటికే ప్రాధాన్యం ఇస్తూ.. తనలో సగమైన తనతో సమానమైన తనతో పాటైన మహిళను ఎందుకు మరుస్తున్నాడు.

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిందని అయినా దేశ రాజధానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో విద్యుత్, రోడ్లు, మౌలిక వసతులు అందలేదని.. అవతలివారిపై అరోపణలు చేస్తూ.. తమ గోప్పలు చెప్పుకుంటున్నారే కానీ.. నిజంగా ఇంకా ఈ సమాజాంలో లింగ సమానత్వం అన్న అంశాన్ని పెద్ద సమస్యగా వీరు స్వీకరించలేకపోతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే.. ఎంతటి ప్రమాదకర పరిణామాలు భవిష్యత తరాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న అలోచన కూడా చేయడం లేదు. సేవ్ ఫ్యూయల్, సేవ్ ఎనర్జీ, సేవ్ పెట్రోల్ అంటున్నారే కానీ సేవ్ గర్ల్ చైల్డ్ అని జాతీయ, అంతర్జాతీయ బాలికా దినోత్సవాల సమయంలోనో లేక మహిళా దినోత్సవం సందర్భంగానో ముభావంగా అంటున్నారే తప్ప.. ఆదిశ గా నిజంగా వేస్తున్న అడుగులు, వేయాల్సిన అడుగులు.. తీసుకోవాల్సిన చర్యలపై ఇంకా మందగమనంలోనే సాగుతున్నాం.

స్వతంత్ర భారతావనిలో ఇంకా ఆడపిల్లలను వద్దనుకునే సమాజాం ఎలా మనగలుగుతుంది.? లింగ సమానత్వం కోసం ఉద్యమించే నాయకులు ఎక్కడ.? ఇంకా భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, బాలిక అక్రమరవాణా, తాజాగా చూస్తున్న చిన్నారి బాలికలపై లైంగిక దాడులు వంటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి.? పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య లాంటి సమస్యలను ఎందుకు బాలికలను పట్టిపీడిస్తున్నాయి.? ఈ నేరాలు, సమస్యల పరిష్కారం కోసం అధునాతన సాంకేతిక మార్గాలు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఇంకా ఎందుకు వేళ్లూనుకున్నాయి.

నిజంగా ఇవి సమస్యలు అని గుర్తించే నాయకులు లేక.? లేక ఇప్పటికీ అమ్మాయి అంటే బరువు అనే తల్లిదండ్రులు మానసిక స్థితి లేకపోవడం కారణమా.? లేక మానసిక పరిణితి చెందేలా ప్రభుత్వాలు ఇప్పటికీ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడమే కారణమా.? యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. అన్న సూక్తులు పలికి మహిళలను క్షణికానందాలకు గురిచేయకపోయినా ఫర్వాలేదు.. కానీ ముసిముసి నవ్వుల అమ్మాయిల సంఖ్య.. అబ్బాయిలతో సమానంగా వుండేలా.. లింగ సమానత్వం సమపాలుగా సాగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

జాతీయ బాలికా దినోత్సవం రోజున ప్రముఖులు ఎందరో శుభాకాంక్షలు తెలుపుతు ట్విట్టర్ లో  #NationalGirlChildDay యాష్ ట్యాగ్ తో పోస్టు పెడుతున్నారు.వాటిలో మచ్చకు కొన్ని మీ ముందుకు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles