Nirbhaya case convicts tight-lipped on last wish ‘నిర్భయ’ దోషుల చివరి కోరిక ఏమిటి.?

Tihar jail authorities ask nirbhaya convicts about their last wish

last wish, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

After fresh death warrants against four convicts in the 2012 Nirbhaya gangrape and murder case were issued the Tihar Jail authorities has asked about their last wish to make it fullfilled before execution on February 1 at 6 am. But the convicts were silent and was looked upon as their willingness to postpone their hanging again.

‘నిర్భయ’ దోషుల చివరి కోరిక ఏమిటి.?

Posted: 01/23/2020 06:44 PM IST
Tihar jail authorities ask nirbhaya convicts about their last wish

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు తేదీ ఖరారై.. సమీపిస్తున్న నేపథ్యంలో దోషుల చివరి కోరిక తీర్చేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాటు చేశారు. నిందితులు వున్న బ్యారక్ లోకి వెళ్లి వారిని తమ చివరి కోరికలు ఏమిటో చెప్పాలని కోరారు. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయాలని ఆదేశిస్తూ ఢిల్లీలోని పాటియాల కోర్టు తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులు తమ చివరి కోరిక ఏమని చెప్పారు.?

ఇక మరణం తమకు ఎదురుగా కనబడుతున్న సమయంలో దోషుల్లో తాము చేసిన తప్పుకు ప్రాయశ్చితం కొంతైనా కనబడుతుంది. కానీ ఈ దోషుల్లో మాత్రం అలాంటి పశ్చాతాపం కనబడలేదు. అంతేకాదు చివరి కోరికను కూడా చెప్పకుండా దోషులందరూ మౌనంగా వుండిపోయారు. తమ మౌనానికి తమకు విధించిన మరణశిక్ష ఈ సారి కూడా వాయిదా పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసేలా వారి హావభావాలు వున్నాయని తీహార్ జైలు అధికారులు తెలిపారు. ఎదుట ఉరికంబం కనిపిస్తున్నా దోషులకు శిక్షపడదన్న నమ్మకం ఎలా కలుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని జైలు అధికారులు నివ్వెరపోతున్నారు.  

జైలు నిబంధనల ప్రకారం.. మరణశిక్ష పడిన దోషుల చివరి కోరికను తీర్చాల్సిన బాధ్యత అధికారులపై వుంటుంది. అయితే ఇలా ఈ శిక్షను ఎదుర్కొనేవారు మాత్రం తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలనో.. లేక తమ పేరును ఉన్న ఆస్తులను కుటుంబసభ్యులో లేక తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకునే కోరికలను కోరుతుంటారు. వాటిని జైలు అధికారులు శిక్షకాలం లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు. అయితే ఈ రెండు విషయాల పై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. వారు మౌనంగా ఉన్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles