AP High Court Orders Status Quo on Amaravati ప్రభుత్వ కార్యాలయాలు తరలించవద్దు: హైకోర్టు ఆదేశం

Ap high court directs ys jagan govt to maintain status quo in amaravati till february 26

YS Jagan, Amaravati, CRDA, AP Assembly, AP Legislative Council, Three Capitals, High Court, CJ Maheshwari, AG Sriram Subramanyam, Petioners, HIghPower Committee report, Mangalagiri, mandadam, Tulluru, Amaravati JAC, joint action committee, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Jagan Mohan reddy, Andhra Pradesh, Politics

The YS Jaganmohan Reddy government faced yet another setback, when the Andhra Pradesh High Court directed that the government offices should not be relocated from Amaravati to Visakhapatnam till next hearing on February 26.

ప్రభుత్వ కార్యాలయాలు తరలించవద్దు: హైకోర్టు ఆదేశం

Posted: 01/23/2020 07:39 PM IST
Ap high court directs ys jagan govt to maintain status quo in amaravati till february 26

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై విషయమై దాఖలైన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యంను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. కాగా, అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు ప్రస్తుతం శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. శాసనమండలిలో సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు.

దీంతో బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కాగా విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ  జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్‌ భాన్‌ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదని అదేశాలను జారీ చేశారు. ఒకవేళ కార్యాలయాలను తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన హైకోర్టు గుర్తించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్‌ భాన్‌ పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైపవర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం దాచిపెట్టిందని.. దానిని వెంటనే బయటపెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరినట్లు అశోక్‌ భాన్‌ తెలిపారు. నివేదికలు అన్నింటినీ కేసుకు సంబంధించిన వారికి తప్పనిసరిగా అందజేయాలని అడ్వొకేట్‌ జనరల్ ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించినట్లు చెప్పారు. కార్యాలయాల తరలింపునకు సంబంధించి చట్టం ఆమోదించేవరకు ఈ అంశంలో ప్రభుత్వం ముందుకెళ్లరాదని హైకోర్టు ఆదేశించినట్లు అశోక్‌ భాన్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles