Pawan Kalyan meets BJP president JP Nadda in Delhi బీజేపితో కలసి ‘లాంగ్ మార్చ్’కు జనసేన పిలుపు

Centre did not approve three capitals proposal pawan kalyan

Pawan Kalyan, JanaSena, BJP, JP Nadda, New BJP President, Kanna Laxmi Narayana, Purandeswari, Nadella Manohar, Sunil Deodhara. GVL Narasimha Rao, Amaravati, Visakhapatnam, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

Pawan Kalyan’s Jana Sena Party entered into an alliance with the BJP in Andhra Pradesh last week. The party has been critical of the YSRC government’s claims that the proposal for shifting the capital has been taken in consultation with the Centre.

బీజేపితో కలసి ‘లాంగ్ మార్చ్’కు జనసేన పిలుపు

Posted: 01/23/2020 03:19 PM IST
Centre did not approve three capitals proposal pawan kalyan

వైసీపీ నేతలు వారి భూ దందాల కోసమే రాజధానిని మార్చాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అరోపించారు. వైసీపీ నేతలు వారి స్వార్థం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన అరోపించారు. రాజధానిగా అమరావతిని కోనసాగించేలా ఫిబ్రవరి 2న బీజేపి, జనసేన సంయుక్తంగా రాజధాని  రైతులకు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం లాంగ్‌ మార్చ్‌ నిర్వహించబోతున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ అంశంలో కేంద్రం నుంచి కూడా అనుమతి పోందామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర బీజేపి నేతలు ఫురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, జీవిఎల్ నరసింహారావు.. జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్ లతో కలసి ఇవాళ ఆయన బీజేపి నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాను కలిశారు. బీజేపి జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల కార్యాచరణపై పవన్‌.. నడ్డాకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

వైసీపీ నేతలు ఎప్పుడూ రాజధాని అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లలేదని జేపీ నడ్డా కూడా స్పష్టం చేసినట్లు పవన్‌ తెలిపారు. రాజధాని మార్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హోం మంత్రి అంగీకారం లేదని పవన్ సప్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని, బీజేపితో కలసి జనసేన నిర్వహించే లాంగ్ మార్చ్ లో వెలగపూడిలోని జగన్ క్యాంప్ క్యారాయలం పికెటిళ్లేలా వుంటుందని అన్నారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోసు జయంతి సందర్భంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా నేతాజీ గురించి గుర్రం జాషువా రాసిన ఓ పద్యాన్ని పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'జాతీయ సభాపతియై నేతాజీ సుభాష్‌ చంద్రబోసు నిఖిల భరత విఖ్యాతిం గడించి గాంధీ చేతంబునకెక్కె సాహసిక సింహంబై. కత్తుల్ బట్టక స్వేచ్ఛరాదెపుడు చర్ఖాపద్ధతుల్ పూర్తిగా చిత్తైపోవు నటంచు గాంధీయునితో సిద్ధాంతమున్ జేసి భూభ్యత్తుల్ దెల్లని చక్రవర్తులు భవప్తిన్ గ్రుంగి కంగారుగా నెత్తించెన్ యావరెస్టు నెత్తయుల పై హిందూరణ స్తంభమున్' అనే పద్యాన్ని పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  BJP  JP Nadda  Amaravati  AP CM Jagan  Andhra Pradesh  Politics  

Other Articles