Former Village Sarpanch Attempts to Sexually Assault Minor మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచార యత్నం..

Former village sarpanch beaten up by locals after he attempts to sexually assault minor

rape, former Sarpanch, minor girl, sexually assault, hospitalise, local thrashed sarpanch, POCSO Act, Mudigonda mandal, Khammam district, Telangana, Crime

A 63-year old former Sarpanch was booked on charge of rape after he allegedly attempted to sexually assault a minor girl in Khammam district, police said on Thursday. He was hospitalised after local residents beat him up over the act, police added.

మైనర్ బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచార యత్నం.. దేహశుద్ది

Posted: 01/23/2020 11:54 AM IST
Former village sarpanch beaten up by locals after he attempts to sexually assault minor

మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్ ను గ్రామప్రజలు దేహశుద్ది చేసిన ఘటన ఇది. తాత వయస్సున మానవమృగం మనవరాలి వయస్సు వున్న బాలికపై అఘాయిత్యానికి యత్నించడంతో బాలిక బంధువులు చావచితకకొట్టారు. అభం శుభం తెలియని 12ఏళ్ల అమాయక బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఉరికి తండ్రిలా కాపాడుకోవాల్సిన హోదాను వెలగబెట్టిన ఘనుడు చేసిన నిర్వాకానికి ఊరంతా తలోచెయి వేసి సన్మానించింది.

మండల పరిధి గ్రామంలో ఓ బాలిక తన తండ్రికి ఫోన్‌ చేసేందుకు మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటిరెడ్డి(63) ఇంటికి వెళ్లింది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడాక మిరపకాయలు తీసుకొని రమ్మని కోటిరెడ్డి బాలికకు చెప్పాడు. ఆమె వాటిని తీసుకొని తిరిగి అతని ఇంటికి వెళ్తుండగా గదిలోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసేపటి బాలిక తల్లి ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి బాలిక అమ్మా అంటూ కేకలు వేయడంతో అక్కడికి వెళ్లింది. బాలిక రోదిస్తూ జరిగినదంతా తల్లికి వివరించింది. ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని పట్టుకుని చితకబాదారు.

దీంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని గదిలో దాక్కున్న నిందితుడ్ని గ్రామస్థులు బయటకు లాగి దాడిచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం గ్రామీణ, రఘునాథపాలెం, కూసుమంచి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన నిందితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఖమ్మం మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ అంజలి ముదిగొండ పీఎస్‌కు చేరుకుని బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక చెప్పిన వాంగ్మూలం తీసుకుని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కోటిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : former Sarpanch  minor girl  sexually assault  POCSO Act  Mudigonda mandal  Khammam  Telangana  Crime  

Other Articles