PrasannaKumar Reddy controversial Comments on AP CM Jagan సీఎం జగన్ పై ప్రసన్నకుమార్ రెడ్డి అసంతృప్తి.!

Nallapareddy prasanna kumar reddy controversial comments on ap cm jagan

Nallapareddy Prasanna Kumar Reddy, Prasanna Kumar Reddy, Nellore, Kovur assembly constituency, Controversial Comments, Botsa Satya Narayana, Anam RamNarayana Reddy, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

YSRCP MLA from Nellor district kovur Assembly Constituency Nallapareddy Prasanna Kumar Reddy Controversial Comments Andhra Pradesh Chief Minister YS Jagan for not getting Ministry in his Cabinet even after being senior in party as MLA.

ITEMVIDEOS: సీఎం జగన్ పై ప్రసన్నకుమార్ రెడ్డి అసంతృప్తి.!

Posted: 01/22/2020 12:52 PM IST
Nallapareddy prasanna kumar reddy controversial comments on ap cm jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదికార వైసీపీ ప్రభుత్వానికి ఎదురులేదన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి లభించిన మెజారిటీని ఒక్కసారి పరిశీలించిన వారెవరికైనా.. ఈ విషయం బోధపడకమానదు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 మంది తనవారే వుండటంతో అధికార పార్టీకి ఎదురులేదన్న సత్యం నిరూపితమైంది. అయితే ఇంతటి గణమైన మెజారిటీ సాధించిన క్రమంలో పార్టీలో అసంతృప్తుల విషయమై కూడా పార్టీ అధిష్టానం ఈ పాటికే చర్యలు కూడా తీసుకుని వుండవచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఎనమిది నెలలు కూడా నిండీనిండకముందే.. పార్టీ సభ్యులలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న తరుణంలో అసెంబ్లీలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు ఆయన తల్లి విజయమ్మ. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల స్థానంలో ఉప ఎన్నికలలో నిలబడి విజయం సాధించారు. అమె తరువాత అప్పట్లో వైసీపీ పార్టీకి తన మద్దతు ప్రకటించాడు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విజయం సాధించిన ఆయన తన నియోజకవర్గంలోని ఓ వర్గం ప్రజలు తన వద్దకు రాగా, వారితో తనలోని అసంతృప్తిని వెళ్లగక్కారు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి బొత్స, దివంగత ఆనం వివేకానందరెడ్డిలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వారికి మద్దతుగా తొలి అడుగు వేసిన తనను విస్మరించి.. అధినేతపై అనుచితంగా వ్యవహరించిన వారు మంత్రి పదవులు అలంకరించారని అన్నారు. ఇదే పదవుల్లో వున్న సమయంలో పలువురు నేతలు తమ అధికార దర్పంతో జగన్ ను ఉరి తీయాలని అన్నారని, సాక్ష్యాత్తు అసెంబ్లీలో విజయమ్మను విజయ అంటూ ఏకవచనంతో సంబోధించిన విషయాలను ఆయన ఊటంకించారు.

జగన్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారని... ఆయన సోదరుడు, దివంగత ఆనం వివేకానందరెడ్డి ఏకంగా జగన్ ను ఉరి తీయాలని అన్నారని చెప్పారు. ఇలాంటి వారందరినీ జగన్ పార్టీలో చేర్చుకుని, ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. విజయమ్మను తిట్టిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్టీలో విజయమ్మ తర్వాత తాను రెండో ఎమ్మెల్యేనని... పార్టీలో సీనియర్ అయిన తనకు పదవి ఇవ్వకపోయినా బాధపడలేదని చెప్పారు.

జగన్ సీఎం కావాలని మాత్రమే కోరుకున్నానని అన్నారు. విడవలూరు మండలంలోని టీడీపీ నేతలు వంశీరెడ్డి, భాస్కర్ రెడ్డిలను వైసీపీలోకి చేర్చుకోవాలని ప్రసన్నకుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ఇతర వైసీపీ శ్రేణులు ఒప్పుకోలేదు. ఈ నెల 16న నెల్లూరులోని ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles