TDP MLAs are acting like Street Rowdies: CM YS Jagan ‘మీరు వీధి రౌడిలా..’ టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఫైర్..

Tdp leaders are acting like street rowdies in the assembly cm ys jagan mohan reddy

YS Jagan, Amaravati, TDP MLAs, AP Assembly, AP Assembly speaker, Tammineni Sitaram, Three Capitals, Andhra Pradesh Assembly, Amaravati, three capital, State Assembly, Mangalagiri, mandadam, Tulluru, Amaravati JAC, joint action committee, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Jagan Mohan reddy, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

As soon as the assembly session for the third and last day begins TDP MLA's have resorted to creating pandemonium in the house chanting slogans in support to Amaravati. The chief minister Jagan Mohan was furious at the TDP leaders act, has lambasted at TDP leaders for acting like street rowdies to stall the house.

‘మీరు వీధి రౌడిలా..’ టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఫైర్..

Posted: 01/22/2020 12:01 PM IST
Tdp leaders are acting like street rowdies in the assembly cm ys jagan mohan reddy

టీడీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చివరిరోజైన ఇవాళ సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరకుని జై అమరావతి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరును వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా దుయ్యబట్టారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కుతగ్గకుండా పోడియం వద్దే నిల్చుని నినాదాలు చేస్తూ సభలో గంధరగోళం సృష్టించారు. దీంతో సభలో అందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

సభను నడవకుండా టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. సభలో కనీసం పట్టుమని 10 మంది సభ్యులు లేరుకానీ... చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మేం 151మంది ఉన్నా ఎంతో ఓపికా ఉన్నామన్నారు. వైసీపీ సభ్యుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు జగన్. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు అగౌరవంగా వ్యవహరిస్తున్నారని అక్షేపించారు. టీడీపీ సభ్యులు తాము ఎమ్మెల్యేలన్న విషయాన్ని మర్చిపోయి వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇంతకంటే దిక్కుమాలిన పార్టీ, దిక్కుమాలిన సభ్యులు ఎక్కడ ఉండరన్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చేతకాకపోతే అసెంబ్లీకి రావొద్దన్నారు. ఎవరైనా పోడియం వద్దకు వస్తే... మార్షల్స్‌తో బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని జగన్ స్పీకర్ తమ్మినేనికి సూచించారు. పోడియం వద్ద మార్షల్స్‌ను పిలిపించి ఉంచాలన్నారు. ఎవరైనా రింగ్ దాటి లోపలికి వస్తే.. వెంటనే బయటకు పంపించేయండని సీఎం జగన్ స్పీకర్ కు తెలిపారు. దీంతో స్పీకర్ వెంటనే మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు. రైతులకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుంటే.. రైతులకు ఎలాంటి మేలు ప్రభుత్వం చేస్తుందో వినాల్సిన సభ్యులు సభలో గంధరగోళం చేయడంపై వైసీపీ సభ్యులు కూడా మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles