Buggana challenges Lokesh on Navaratnalu నారా లోకేష్ కు సవాల్ విసిరిన బుగ్గన

Finance minister buggana challenges nara lokesh to prove his remarks on navaratnalu

Buggana Rajendranath Reddy, Nara Lokesh, Nara Lokesh Twitter, Nara Lokesh twitter video, Amaravati, Nava Ratnalu, Amaravati, AP Capital Issue, CRDA repeal bill, Legislative Council, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

In the heated debate on the decentralisation and CRDA (Repeal) bills in the legislative council, the finance minster Rajendranath Reddy has challenged Nara Lokesh to proves his charges on the government.

ITEMVIDEOS: సీఎం జగన్ పై వీడియోతో విరుచుకుపడ్డ లోకేష్.. సవాల్ విసిరిన బుగ్గన

Posted: 01/22/2020 02:56 PM IST
Finance minister buggana challenges nara lokesh to prove his remarks on navaratnalu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేసేందుకు చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ వ్యాఖ్యలపై శాసనమండలిలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన నిరూపించాలని బుగ్గన సవాల్‌ విసిరారు. నవరత్నాలు అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు.

అయినా ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ తన వ్యాఖ్యలను నిరూపించాలని, ఈ క్రమంలో కనీసం ఆ జీవో నెంబరును చెప్పినా చాలునని అన్నారు. ప్రభుత్వం మసీదులు, చర్చిలు, దేవాలయాల భూములు అమ్ముకోవచ్చని ఎప్పుడూ జీవో జారీ చేయలేదని బుగ్గన స్పష్టం చేశారు. అదే నిజమైతే.. ఆ జీవో ఎక్కడుందో చూపించాలని సవాల్‌ విసిరారు.. లేనిపక్షంలో సభకు నారా లోకేష్‌ క్షమాపణ చెప్పాలని బుగ్గన డిమాండ్‌ చేశారు.

అంతకుముందు నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై వీడియో రూపంలో విమర్శలు గుప్పించారు. అమరావతి నుండి రాజధానిని తరలింపుపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధిపై ఓ సామాన్య యువకుడి అభిప్రాయాలను వీడియో రూపంలో ట్వీట్ చేశారు. ఆ యువకుడికి ఉన్న తెలివిలో అణువంతనైనా జగన్ కు ఉండుంటే ఈ దౌర్భాగ్యపు స్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో మాట్లాడిన యువకుడు రాజధాని, అభివృద్ధిపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చాడు.

ఓ ప్రభుత్వ ఆఫీసు తరలించినంత మాత్రాన అక్కడ అభివృద్ధి జరగదని, అందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉదాహరణ అని తెలిపాడు. తమ చిన్నప్పటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే ఉన్నాయని, ఇకముందూ అలాగే ఉంటాయని, కానీ నిన్నమొన్న వచ్చిన సైబరాబాద్, హైటెక్స్ భారీస్థాయిలో అభివృద్ధి చెందాయని వివరించాడు. అక్కడ ప్రయివేటు సంస్థలు భారీగా రావడంతో ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో జరిగిందని, తద్వారా అత్యంత వేగంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles