TDP MLC quits over three-capital move మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

Former minister dokka manikya varaprasad gives a rude shock to tdp resigns as mlc

Amaravati, Capital, Dokka Manikya vara prasad, TDP MLC, Resignation, Chandrababu, Yanamala Ramakrishnudu, TDP MLC, Vijayawada, YS Jagan, Capitals, Andhra Pradesh, Politics

In a rude shock to TDP, former minister and TDP leader surprised everyone by submitting his resignation to the membership of the Legislative Council.

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

Posted: 01/21/2020 02:24 PM IST
Former minister dokka manikya varaprasad gives a rude shock to tdp resigns as mlc

అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కోన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాష్ట్ర విభజనతో అమరావతి రాజధాని కావాలని తాను అసెంబ్లీలోనూ, బయటా ప్రయత్నాలు చేశానని గుర్తు చేసుకన్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను నిత్యం అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ..తనపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞుడనని పేర్కోన్నారు. , వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకష్ తన పట్ల చూపిన అభిమానానికి ధన్యవాదాలని చెప్పిన ఆయన మరో షాకింగ్ విషయాన్ని కూడా పేర్కోన్నారు. ఇటీవల 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును చూసిన తాను భవిష్యత్తులో ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నానని తెలిపారు. అయినా తనను అభిమానించి, ఆదరించిన ప్రతిపాడు ప్రజలకు తాను నిత్యం రుణపడి వుంటానని అన్నారు.

ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం వెనుక అధికార వైసీపీ పార్టీ వ్యూహలు వున్నట్లు పలువురు టీడీపీ శ్రేణులు అరోపిస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయకుండా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ నిన్న అర్థరాత్రి అసెంబ్లీలో బిల్లు అమోదం పోందింది. దీంతో పారిపాలన వికేంద్రీకరణకు కూడా తెరలేపుతున్నట్లు ప్రభుత్వం పేర్కోంది. అయితే మాణిక్యవరప్రసాద్ మాత్రం క్రితం రోజునే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా రెండో రోజు హాజరుకాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. గత ఎన్నికల్లో పత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా డొక్కా పోటీ చేశారు. అయితే.. డొక్కా సమావేశాలకు గైర్హాజరు కావడంపై టీడీపీలో చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని ఆమె తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సభలో లేకపోవడం కొసమెరుపు.

అయితే శాసనమండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డొక్కాను ఆప్యాయంగా పలకరించారు. డొక్కా కూడా నవ్వుతూ జగన్‌ను కుశలమడిగారు. దీంతో.. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం మొదలైంది. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ప్రస్తావించారు. దీంతో డొక్కా రాజీనామా వెనుక అధికార పార్టీ వుందన్న వాదనలకు బలం చేకూరుతోంది. శాసనమండలిలో టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకి సంఖ్యా బలం తక్కువ. దీంతో.. వ్యూహం ప్రకారం వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తున్నట్లు సమాచారం. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపి తమ వైపు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహం రచించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh